ప్రసన్న, స్నేహలకు పొరుగింటి ముస్లిం దంపతుల గిఫ్ట్‌

భారతదేశం సర్వమతాల సమ్మేళనం. ఎదుటి మనిషి నచ్చితే చాలు కులం, మతం పట్టించుకోకుండా వారితో సత్సంబంధాలను ఏర్పరచుకుంటుంటారు ఇక్కడి ప్రజలు

ప్రసన్న, స్నేహలకు పొరుగింటి ముస్లిం దంపతుల గిఫ్ట్‌
TV9 Telugu Digital Desk

| Edited By:

Oct 25, 2020 | 3:53 PM

Prasanna Sneha couple: భారతదేశం సర్వమతాల సమ్మేళనం. ఎదుటి మనిషి నచ్చితే చాలు కులం, మతం పట్టించుకోకుండా వారితో సత్సంబంధాలను ఏర్పరచుకుంటుంటారు ఇక్కడి ప్రజలు. వారి వారి పండుగలకు ఇతర మతాల వారిని ఇంటికి పిలిచి సెలబ్రేట్‌ చేసుకునే వారు దేశంలో చాలా మందే ఉన్నారు. ఇదంతా పక్కనపెడితే ప్రసన్న, స్నేహ పొరుగింటి ముస్లిం దంపతులు ఇప్పుడు హిందూ-ముస్లిం ఐక్యతను చాటుకున్నారు. స్నేహ దంపతులకు వారు బిల్వం చెట్టును ఇవ్వడంతో పాటు.. వారితో కలిసి దాన్ని నాటారు. ఈ విషయాన్ని ప్రసన్న తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

నా వాట్సాప్‌ డీపీలో ఎప్పుడూ శివుడు ఉంటాడు. దాన్ని చూసిన మా పొరుగింటి జబీర్‌, నజీబా దంపతులు నాకు ఈ ఉదయం బిల్వం మొక్కను గిఫ్ట్‌గా ఇచ్చారు. నాటే సమయంలోనూ వారు తమ చెయ్యి అందించారు. పండుగ రోజున ఇంతకన్నా గొప్ప సంతోషం ఏముంటుంది అని కామెంట్‌ పెట్టారు. ఇక ప్రసన్న పోస్ట్‌కి నెటిజన్లు లౌకికవాదానికి భారతదేశం గొప్ప నిర్వచనం అన్నది మరోసారి రుజువైంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read More:

7,801 వజ్రాలతో రింగ్‌.. ‘గిన్నెస్‌ రికార్డు’ సాధించిన భారతీయ స్వర్ణకారుడు

మోస్ట్ వాంటెడ్‌ అల్‌ ఖైదా సీనియర్ టెర్రరిస్ట్‌ హతం

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu