‘ధూమ్ 4’లో ప్రభాస్.. ఆ నిర్మాణ సంస్థ ఎదురుచూపులు.!
బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ నుంచి వచ్చిన 'ధూమ్' సిరీస్ పెద్ద సంచలనం అని చెప్పాలి. కమర్షియల్ హంగులతో అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సిరీస్ విజువల్ ట్రీట్ ఇచ్చింది.

Dhoom 4 Movie: బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ నుంచి వచ్చిన ‘ధూమ్’ సిరీస్ పెద్ద సంచలనం అని చెప్పాలి. కమర్షియల్ హంగులతో అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సిరీస్ విజువల్ ట్రీట్ ఇచ్చింది. ఇప్పటికే ఈ ‘ధూమ్’ సిరీస్‌లో వచ్చిన మూడు భాగాలు బ్లాక్‌బస్టర్ హిట్స్ సాధించాయి. దీనితో నాలుగో భాగాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలని యష్ రాజ్ ఫిలిమ్స్ భావిస్తోందట. అంతేకాదు ఈ సినిమా విలన్ రోల్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.
ఆ రోల్‌లో ఈసారి సౌత్ స్టార్లను నటింపజేయాలని అనుకుంటున్నారట. ‘డార్లింగ్’ ప్రభాస్ అయితే అందుకు సరిగ్గా సరిపోతాడని భావిస్తున్నారు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్‌లో ప్రభాస్ భాగమైతే దక్షిణాదిలో కూడా తమ మార్కెట్‌ను మరింత విస్తరించేందుకు అవకాశం ఉంటుందని యష్ రాజ్ సంస్థ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ‘బాహుబలి’ విడుదలైన నాటి నుంచి అతడితో సినిమా చేయాలని నిర్మాత ఆదిత్య చోప్రా అనుకుంటున్నారు.
‘ధూమ్ 4’లో ప్రభాస్‌ను విలన్ గా ఓకే చేయించాలని.. ఎలాగో ఈ సినిమాలో హృతిక్ రోషన్ కూడా ఉంటాడు కాబట్టి.. వీరిద్దరి కాంబినేషన్‌కు బాక్స్ ఆఫీస్ రికార్డులు షాక్ అవుతాయని ఆయన అంచనా.. ఇప్పటికీ ఆదిత్య చోప్రా ప్రభాస్‌ను ‘ధూమ్’ సిరీస్‌లో భాగం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. కాగా, డార్లింగ్ ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు.