Paal Poli Recipe: ఉగాది స్పెషల్ రాయలసీమ స్పెషల్ ‘పాల పోళీ’లు తయారీ విధానం తెలుసుకుందాం..!
Paal Poli Recipe: హిందువుల పండగలు వస్తున్నాయంటే సాంప్రదాయ వంటలకు పై అందరి దృష్టి వెళ్తుంది. ఇక ఉగాది స్పెషల్ గా తెలుగు వారి లోగిళ్లలో.. ఉగాది పచ్చడితో పాటు బొబ్బట్లు, పాల పోళీ..
Paal Poli Recipe: హిందువుల పండగలు వస్తున్నాయంటే సాంప్రదాయ వంటలకు పై అందరి దృష్టి వెళ్తుంది. ఇక ఉగాది స్పెషల్ గా తెలుగు వారి లోగిళ్లలో.. ఉగాది పచ్చడితో పాటు బొబ్బట్లు, పాల పోళీ కూడా ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించుకున్నాయి. అవును పూజలూ, శుభకార్యాల సందర్భాలలో చేసుకునే అతి ముఖ్యమైన తీపి పిండివంటల్లో “బొబ్బట్లు” ఎంతో ఆదరణ పొందాయి. వీటిని తయారు చేయడంలో….కొద్దిగా శ్రమతో కూడుకున్నదే.. అయితే వీటిని తినే సమయంలో బొబ్బట్లమీద కొంచెం నెయ్యి వేసి తింటే.. ఆహా ఏమి రుచి అనరా మైమరచి అంటారు మరి.. ఈరోజు ఉగాది స్పెషల్ రాయలసీమ స్పెషల్ పాల పోళీ తయారీ విధానము తెలుసుకుందాం..!
కావలసిన పదార్ధాలు:
చిక్కటి పాలు: రెండు లీటర్లు చక్కెర: తీపికి సరిపడా బాదంపప్పు జీడిపప్పు యాలకులు కుంకుమపువ్వు:
పోళీ చేసేందుకు కావలసినవి:
మైదాపిండి: రెండు కప్పులు కొంచెం తినే సోడా ఉప్పు కొంచెం నూనె: తగినంత
తయారుచేసే విధానం:
* ముందుగా పాలను తక్కువ వేడిలో పెట్టి బాగా మరిగించాలి. ఇంతలో బాదం, జీడిపప్పులను నీటిలో నానబెట్టి మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. * పాలు బాగా సగానికి సగం మరిగిన తర్వాత ఆ పాలల్లో చక్కెర, బాదం జీడిపప్పుల పేస్ట్ యాలకుల పొడి అన్నీ వేసి కలపాలి. * తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి.. ఇంతలో మైదాపిండితో చిన్నిచిన్న పూరీలు నూనెలో వేయించాలి. అనంతరం వాటిని చల్లారిన పాల మిశ్రమం లో వేయాలి. కొంచెం సేపు ఆ పాలల్లో ఊరిన ఊరిన పూరీలను తీసి ఒక ప్లేట్లో వేసి దానిపై కొంచెం చక్కెరపొడి, కుంకుమ పువ్వుతో అలంకరించి సర్వ్ చేయాలి.
అంతే ఎంతో రుచికరమైన ఉగాది స్పెషల్ రాయలసీమ పాలపోళీలు రెడీ..
Also Read: బాటిల్స్ తో పాలు తాగుతున్న మేకపిల్లలు.. టెయిల్ పవర్ చూడమంటున్న ఆనంద్ మహేంద్ర
గట్టిగా అంకెలు లెక్కబెడితే.. కరోనా ఉందో లేదో చెప్పేస్తున్న యాప్.. అయితే.. !