కరోనా పరీక్షల్లో నెగెటివ్‌.. కన్నతల్లి ఒడిలోనే కన్నుమూసిన కొడుకు.. గుండెలను పిండెస్తున్న హృదయ విదారక ఘటన

Nizamabad District: కరోనా మహహ్మారితో ప్రపంచమంతా అతలాకుతలం అవుతోంది. వైరస్‌ ప్రభావం అంతా ఇంతా కాదు. కుటుంబాలను సైతం వేరు చేసేస్తోంది. కొందరు కరోనా అనే...

కరోనా పరీక్షల్లో నెగెటివ్‌.. కన్నతల్లి ఒడిలోనే కన్నుమూసిన కొడుకు.. గుండెలను పిండెస్తున్న హృదయ విదారక ఘటన
Follow us

|

Updated on: Apr 26, 2021 | 12:23 PM

Nizamabad District: కరోనా మహహ్మారితో ప్రపంచమంతా అతలాకుతలం అవుతోంది. వైరస్‌ ప్రభావం అంతా ఇంతా కాదు. కుటుంబాలను సైతం వేరు చేసేస్తోంది. కొందరు కరోనా అనే అనుమానంతో కూడా ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు చూస్తూనే ఉన్నాము. కరోనాతో మృతి చెందిన వారిని కడసారి చూపునోచుకోలేని పరిస్థితి దాపురించింది. ఏ వ్యాధులు వచ్చినా.. భయపడని జనాలు.. కరోనా అంటేనే వెన్నులో వణుకుపుడుతోంది. తాజాగా నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌ మండలంలో జరిగిన ఘటన ప్రతి ఒక్కరిని కంటతడిపెట్టిస్తోంది. కన్నతల్లి ఒడిలోనే కొడుకు కన్నుమూసిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. మండలంలోని బోర్గం గ్రామానికి చెందిన అశోక్‌ (32) అనే వ్యక్తి రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో తల్లి, భార్య, తమ్ముడి సహాయంతో రెంజల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పరీక్షల కోసం వచ్చాడు. రెండు టెస్టుల్లో కరోనా నెగెటివ్‌ రావడంతో ఆస్పత్రి ఆవరణలో ఓ చెట్టు కింద సేద తీరారు. ఆ సమయంలో ఉన్నట్టుండి తల్లి ఒడిలోనే పడిపోయి అశోక్‌ ప్రాణాలు విడిచాడు. కళ్లముందే కొడుకు ప్రాణాలు పోవడంతో తల్లి గంగవ్వ, భార్య లక్ష్మీ తల్లిడిల్లుతున్నారు.  ఉన్నట్టుండి అశోక్‌ ప్రాణాలు పోవడం విషాదంగా మారింది. అయితే తర్వాత కరోనా టెస్టుల్లో నెగెటివ్‌ వచ్చింది. కరోనా అనే అనుమానంతో టెన్షన్‌కు గురయ్యాడు అశోక్‌. దీంతో కొడుకు మృతి చెందడంతో ఇంటికి పోదాం అంటూ తల్లి రోదిస్తున్న తీరు పలువురిని కలచివేసింది.

కరోనా భయంతో కళ్లముందే చెట్టంత కొడుకు కూర్చున్న చోటనే విగతజీవిగా మారడంతో కన్నపేగు కన్నీటి రోదన హృదయాలను కలచివేస్తోంది. అలాగే ప్రాణాలు కోల్పోయిన భర్తను పట్టుకుని భార్య రోదించడం గుండెలను పిండేస్తోంది. కాగా, కరోనా మహమ్మారి ఎందరినో బలి తీసుకుంటుంటోంది. గత ఏడాది నుంచి అతలాకుతలం చేస్తున్న కరోనా.. సెకండ్‌వేవ్‌లో తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కడసారి చూపు నోచుకోని విధంగా చేస్తోంది.

ఇవీ చదవండి: Oxygen Shortage: కోవిడ్ సోకిన భర్తను కాపాడుకునేందుకు భార్య ప్రయత్నం.. నోటి ద్వారా శ్వాస.. అయినా దక్కని ప్రాణం..

షాకింగ్‌ వ్యాఖ్యలు.. మరో రెండు సంవత్సరాలు అప్రమత్తంగానే ఉండాలి.. కరోనాపై ఐఐఎం అహ్మదాబాద్‌ ప్రొఫెసర్‌

Latest Articles