AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘సాహో’ సంగీత దర్శకుడిపై దాడి

గురు రాంధ్వా… ఈ పేరు తెలియని బాలీవుడ్ సంగీత ప్రియులు ఉండరు. అయితే ఈయన ఇప్పుడు తెలుగు లో కూడా రంగ ప్రవేశం చేశారు. సాహో చిత్రం నుంచి విడుదల అయిన ఒక పాట ద్వారా ఆయన తెలుగు పరిశ్రమలో కూడా అడుగు పెట్టారు. ఈ పాటను ఎంతగానో ప్రమోట్ చేశారు గురు. అయితే ఈ సినిమా ప్రోమో మాత్రమే విడుదల చేసిన టీమ్, పూర్తి వీడియో ని ఆగస్టు 2వ తారీఖున విడుదల చేయనున్నారు. ఇటీవల […]

‘సాహో’ సంగీత దర్శకుడిపై దాడి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 31, 2019 | 4:41 PM

Share

గురు రాంధ్వా… ఈ పేరు తెలియని బాలీవుడ్ సంగీత ప్రియులు ఉండరు. అయితే ఈయన ఇప్పుడు తెలుగు లో కూడా రంగ ప్రవేశం చేశారు. సాహో చిత్రం నుంచి విడుదల అయిన ఒక పాట ద్వారా ఆయన తెలుగు పరిశ్రమలో కూడా అడుగు పెట్టారు. ఈ పాటను ఎంతగానో ప్రమోట్ చేశారు గురు. అయితే ఈ సినిమా ప్రోమో మాత్రమే విడుదల చేసిన టీమ్, పూర్తి వీడియో ని ఆగస్టు 2వ తారీఖున విడుదల చేయనున్నారు.

ఇటీవల గురు అమెరికా కెనాడలలో సంగీత ప్రదర్శనలు ఇచ్చారు. చివరగా వాన్‌కోర్‌లో ప్రదర్శన సందర్భంగా జరిగిన చిన్న గొడవలో గురు గాయపడ్డాడు. తాను స్టేజ్‌ మీద పర్ఫామ్‌ చేస్తున్న సమయంలో ఓ పంజాబీ వ్యక్తి స్టేజ్‌ మీదకు వచ్చే ప్రయత్నం చేశాడని, అతడిని వద్దని వారించటంతో ప్రొగ్రామ్‌ అయిపోయి తిరిగి వెళ్లే సమయంతో తనపై దాడి చేశారని గురు తన సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశాడు. ఈ దాడిలో గురుకు కంటి పై భాగంలో తీవ్రగాయం కావటంతో నాలుగు కుట్టు పడ్డాయి. ఇండియా తిరిగి వచ్చిన గురు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు.

https://www.instagram.com/p/B0icoquHvhD/?utm_source=ig_web_copy_link