AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. రెండో వన్డే నుంచి ప్రిన్స్ ఔట్..?

Shubman Gill Retired Hurt: భారత జట్టు విజయానికి గిల్ ఇన్నింగ్స్ అత్యంత కీలకంగా మారిన సమయంలో ఈ గాయం జట్టు విజయావకాశాలను దెబ్బతీసింది. తాజా గాయం తీవ్రత దృష్ట్యా అతను మళ్లీ ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు రావడం దాదాపు అసాధ్యంగానే కనిపిస్తోంది. తదుపరి మ్యాచులకు కూడా గిల్ ఫిట్‌నెస్‌పై అభిమానుల్లో, టీమ్ మేనేజ్‌మెంట్‌లో తీవ్ర ఆందోళన నెలకొంది.

IND vs ENG: టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. రెండో వన్డే నుంచి ప్రిన్స్ ఔట్..?
Shubman Gill Retired Hurt
Venkata Chari
|

Updated on: Jul 15, 2026 | 8:34 AM

Share

Shubman Gill Retired Hurt: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత జట్టుకు ఊహించని భారీ షాక్ తగిలింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ త్వరగానే పెవిలియన్ చేరిన కష్టకాలంలో జట్టును ఆదుకున్న యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తీవ్రంగా గాయపడ్డాడు. సెంచరీకి చేరువవుతున్న తరుణంలో కండరాల నొప్పితో విలవిలలాడుతూ రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని వీడటం అభిమానులను కలచివేసింది.

బాధ్యతాయుతమైన కెప్టెన్ ఇన్నింగ్స్.. కానీ అంతలోనే!

259 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల వికెట్లను త్వరగా కోల్పోయి జట్టు తీవ్ర ఒత్తిడిలో పడింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో భారత జట్టు వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పూర్తి బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు. ఎంతో ఓపికగా ఆడుతూనే, వీలు చిక్కినప్పుడల్లా ఇంగ్లీష్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. తనదైన క్లాసిక్ డ్రైవ్‌లు, అద్భుతమైన షాట్లతో అలరిస్తూ తన వన్డే కెరీర్‌లో 10వ సెంచరీ దిశగా వేగంగా దూసుకెళ్లాడు.

ఇది కూడా చదవండి: ఆ ముగ్గురు దద్దమ్మలు ఇక ఇంటికే.. వచ్చేస్తున్నాడ్రోయ్ అసలైన పులి.. కోహ్లీ దోస్త్ గ్రాండ్ ఎంట్రీ?

ఇవి కూడా చదవండి

నొప్పితో విలవిల.. కన్నీటిపర్యంతమవుతూ మైదానం వీడిన గిల్..

అయితే, ఇన్నింగ్స్ సాగుతున్న కొద్దీ గిల్ కుడి కాలి కండరాల నొప్పితో (క్రాంప్స్) తీవ్ర ఇబ్బంది పడ్డాడు. పదే పదే నొప్పితో బాధపడుతున్నా, అప్పటికే కీలక వికెట్లు కోల్పోయినందున జట్టు కోసం పట్టుదలతో క్రీజులో నిలిచే ప్రయత్నం చేశాడు. కానీ, 26వ ఓవర్లో పరిస్థితి మరింత విషమించింది. కనీసం నడవలేని స్థితిలో మైదానంలోనే కూలబడిపోయాడు. జట్టు ఫిజియో రెండుసార్లు మైదానంలోకి వచ్చి పరీక్షించినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. కేవలం 75 బంతుల్లో 80 పరుగులు చేసి సెంచరీకి కేవలం 20 పరుగుల దూరంలో ఉన్న గిల్, నొప్పితో కుంటుకుంటూ రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని వీడాల్సి రావడం అందరినీ బాధిస్తోంది.

ఇది కూడా చదవండి: Kohli vs Gambhir: టీమిండియాలో ముదిరిన విభేదాలు.. కోచ్ గంభీర్, కోహ్లీ మధ్య మాటలు బంద్..?

గిల్ వెళ్లగానే పేకమేడలా కూలిన మిడిలార్డర్..

గిల్ క్రీజులో ఉన్నంత వరకు 149/2 స్కోరుతో అత్యంత పటిష్ట స్థితిలో, విజయం వైపు సాగుతున్నట్లు కనిపించిన టీమిండియా.. అతడు మైదానాన్ని వీడగానే ఒక్కసారిగా కుప్పకూలింది. శ్రేయాస్ అయ్యర్ అప్పటి వరకు అండగా నిలిచినా, గిల్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాతి 11 పరుగుల వ్యవధిలోనే శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వరుసగా పెవిలియన్ బాట పట్టారు. అప్పటివరకు భారత్ చేతిలో ఉన్న మ్యాచ్‌పై ఇంగ్లాండ్ బౌలర్లు మళ్లీ పూర్తి పట్టు బిగించారు.

ఇది కూడా చదవండి: ఇంగ్లాండ్‌లో ఇరగదీసినా.. ఆ టీమిండియా స్టార్ ప్లేయర్‌కు 2027 వరల్డ్ కప్‌లో నో ప్లేస్.. ఎందుకంటే..?

రిటైర్డ్ హర్ట్ కావడం గిల్‌కు ఇది తొలిసారి కాదు..

వన్డే క్రికెట్‌లో శుభ్‌మన్ గిల్ ఇలా అద్భుతమైన ఫామ్‌లో ఉండి, సెంచరీకి చేరువలో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగడం ఇది తొలిసారి కాదు. 2023 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌పై కూడా ముంబై వాంఖడే స్టేడియంలో సరిగ్గా 79 పరుగుల వద్ద ఇలాగే కండరాల నొప్పితో మైదానాన్ని వీడాడు. దిలీప్ వెంగ్‌సర్కార్, సౌరవ్ గంగూలీ, క్రిస్ శ్రీకాంత్ వంటి దిగ్గజాల సరసన వన్డేల్లో బహుళసార్లు రిటైర్డ్ హర్ట్ అయిన భారతీయ ఆటగాళ్ల జాబితాలో ఇప్పుడు గిల్ కూడా చేరాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us