ఉద్ధవ్‌కు శరద్ పవార్ ఫోన్.. నాకేం తెలియదు..!

మహారాష్ట్రలో రాత్రికి రాత్రి.. హైడ్రామా నడిచింది. ఉదయం అనూహ్యంగా.. దేవేంద్ర ఫడ్నవీస్.. మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్.. ప్రమాణం చేశారు. తాజాగా.. ఈ విషయంపై ఎన్సీసీ చీఫ్ శరద్ పవార్ స్పందించారు. ‘అసలు ఈ విషయం గురించి నాకేం తెలియదని.. ఈ వార్త విని నేనూ షాక్‌కి గురైట్లు ఆయన పేర్కొన్నారు. ఇది అజిత్‌ వ్యక్తిగత నిర్ణయమని.. పార్టీది కాదని ఆయన ట్విట్‌లో పేర్కొన్నారు. అజిత్ తీసుకున్న నిర్ణయాన్ని తాము […]

  • Tv9 Telugu
  • Publish Date - 10:05 am, Sat, 23 November 19
ఉద్ధవ్‌కు శరద్ పవార్ ఫోన్.. నాకేం తెలియదు..!

మహారాష్ట్రలో రాత్రికి రాత్రి.. హైడ్రామా నడిచింది. ఉదయం అనూహ్యంగా.. దేవేంద్ర ఫడ్నవీస్.. మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్.. ప్రమాణం చేశారు. తాజాగా.. ఈ విషయంపై ఎన్సీసీ చీఫ్ శరద్ పవార్ స్పందించారు. ‘అసలు ఈ విషయం గురించి నాకేం తెలియదని.. ఈ వార్త విని నేనూ షాక్‌కి గురైట్లు ఆయన పేర్కొన్నారు. ఇది అజిత్‌ వ్యక్తిగత నిర్ణయమని.. పార్టీది కాదని ఆయన ట్విట్‌లో పేర్కొన్నారు. అజిత్ తీసుకున్న నిర్ణయాన్ని తాము సమర్థించలేమని.. మద్దతు కూడా ఇవ్వమని ఆయన అన్నారు. అసలు.. అజిత్.. బీజేపీతో చేతులు కలిపిన విషయం ఈ రోజు ఉదయమే నాకు తెలిసిందన్నారు. ఉద్దవ్‌కి కూడా ఫోన్ చేసి కనుక్కున్నా.. దీనిపై కాసేపటి తర్వాత.. ఇద్దరం కలిసి.. మీడియాతో మాట్లాడతామని’ పేర్కొన్నారు శరద్ పవార్.