తెల్లవారుజామునే రాష్ట్రపతి పాలన ఎత్తివేత.. అసలు జరిగిన స్టోరీ ఇదే..!
మహారాష్ట్రలో కొనసాగుతున్న రాష్ట్రపతి పాలన ముగిసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను కేంద్ర హోం శాఖ జారీ చేసింది. శనివారం తెల్లవారుజామున 5.47 నిమిషాలకు మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తున్నట్లు ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆ తర్వాత ఉదయం 8.00 గంటలకు ఎన్పీపీ మద్దతుతో బీజేపీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే.. ఈ అనూహ్య […]

మహారాష్ట్రలో కొనసాగుతున్న రాష్ట్రపతి పాలన ముగిసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను కేంద్ర హోం శాఖ జారీ చేసింది. శనివారం తెల్లవారుజామున 5.47 నిమిషాలకు మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తున్నట్లు ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆ తర్వాత ఉదయం 8.00 గంటలకు ఎన్పీపీ మద్దతుతో బీజేపీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే.. ఈ అనూహ్య పరిణామాలన్నీ చకచక అయిపోయాయి. ఎవరూ ఊహించని విధంగా బీజేపీ అధినాయకత్వం.. కాంగ్రెస్, శివసేన పార్టీలకు భారీ షాక్ ఇచ్చింది. శివసేన పార్టీ చీఫ్ ఉద్దవ్ థాక్రే.. సీఎంగా ఉండబోతున్నారని.. దీనికి సంబంధించి శుక్రవారం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే కేవలం కొద్ది గంటల్లోనే మహా రాజకీయాలు అనూహ్య మలుపులు తిరిగాయి.
జరిగిన సీన్ ఇదే..
* శుక్రవారం సాయంత్రం శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల మీటింగ్ అనంతరం.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఉద్దవ్ థాక్రే సీఎం అంటూ ప్రకటన * ఆ తర్వాత.. అజిత్ పవార్ కొంత మంది ఎమ్మెల్యేలతో ఫడ్నవీస్ గెస్ట్ హౌస్‌లో భేటీ.. * ఈ భేటీలొ కొందరు శివసేన రెబెల్స్ ఎమ్మెల్యేలు కూడా హాజరు * స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడ బీజేపీకే మద్దతు తెల్పుతూ ఫడ్నవీస్‌కు హామీ * ఇదంతా శుక్రవారం అర్థరాత్రి చోటుచేసుకున్న ఘటన * తెల్లవారు జాము వరకు కొనసాగిన అజిత్ పవార్‌తో ఫడ్నవీస్ చర్చలు * చర్చల అనంతరం తెల్లవారు జామున 4.00 గంటలకు కేంద్ర హోం శాఖకు సమాచారం * ఆ వెంటనే గవర్నర్‌కు కూడా సమాచారం అందజేత * రాష్ట్రపతి పాలన ఎత్తివేయాలంటూ కేంద్ర హోం శాఖకు గవర్నర్ లేఖ * కేంద్ర హోం శాఖ విషయాన్ని రాష్ట్రపతికి అందజేత * వెంటనే రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తూ (తెల్లవారు జామున 5.47) రామ్ నాథ్ కోవింద్ ఆమోదం * ఉదయం 7.40 నిమిషాలకు రాజ్ భవన్ రావాలంటూ అజిత్ పవార్ టీంకు బీజేపీ నుంచి ఫోన్ * 8.00 గంటల లోపే రాజ్ భవన్‌కు చేరిన బీజేపీ, ఎన్సీపీ ఎమ్మెల్యేలు * 8.11 నిమిషాలకు సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం.
కొస మెరుపు ఎంటంటే.. ఇదంతా కొన్ని గంటల వ్యవధిలోనే జరిగిపోయింది.
కాగా, నవంబర్ 12వ తేదీన మహారాష్ట్రలో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది. ఓ వైపు ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన పార్టీల మధ్య చర్చలు జరుగుతుండగానే.. ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ సిఫారసు చేశారు. దీనికి కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం. . ఆ తర్వాత వెంటనే రాష్ట్రపతికి పంపడం జరిగింది. ఆ వెంటనే దానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేయడంతో.. అంతా చకచకా జరిగిపోయింది. మొత్తానికి మహారాష్ట్ర పన్నెండు రోజులు కొనసాగిన రాష్ట్రపతి పాలనకు ఎండ్ కార్డ్ పడింది. కాగా, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ బల్లా కేవలం మూడు వాక్యాలతో కూడిన నోటిఫికేషన్‌ను జారీ చేయడం కొసమెరుపు.
The notification revoking President’s rule in Maharashtra pic.twitter.com/JSbAIOFUE6
— ANI (@ANI) November 23, 2019



