AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమిత్.. అజిత్ వ్యూహం.. ఫడ్నవీస్ కే ‘ యోగం ‘

ఎన్నికల ఫలితాలు ప్రకటించిన నెల రోజులపైగా తరువాత మహారాష్ట్ర రాజకీయాలు ఓ కొలిక్కివచ్చాయి. రాష్ట్ర సీఎం గా మళ్ళీ బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ అధికారపగ్గాలు చేబట్టారు. హఠాత్తుగా జరిగిన పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఆయన శనివారం ఉదయం ప్రమాణ స్వీకారం చేయగా..డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణం చేశారు. ఈ అనుకోని ఈ మార్పులు శివసేన, కాంగ్రెస్ పార్టీలను షాక్ కి గురి చేశాయి. శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రేను సీఎం చేసేందుకు ఏకాభిప్రాయం కుదిరిందని, […]

అమిత్.. అజిత్ వ్యూహం.. ఫడ్నవీస్ కే ' యోగం '
Pardhasaradhi Peri
|

Updated on: Nov 23, 2019 | 11:46 AM

Share

ఎన్నికల ఫలితాలు ప్రకటించిన నెల రోజులపైగా తరువాత మహారాష్ట్ర రాజకీయాలు ఓ కొలిక్కివచ్చాయి. రాష్ట్ర సీఎం గా మళ్ళీ బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ అధికారపగ్గాలు చేబట్టారు. హఠాత్తుగా జరిగిన పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఆయన శనివారం ఉదయం ప్రమాణ స్వీకారం చేయగా..డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణం చేశారు. ఈ అనుకోని ఈ మార్పులు శివసేన, కాంగ్రెస్ పార్టీలను షాక్ కి గురి చేశాయి. శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రేను సీఎం చేసేందుకు ఏకాభిప్రాయం కుదిరిందని, సేన-ఎన్సీపీ- కాంగ్రెస్ పార్టీల కూటమి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఎన్సీపీ సీనియర్ నేత శరద్ పవార్ ప్రకటించి కొన్ని గంటలైనా గడిచాయో.. లేదో.మహారాష్ట్ర ‘ రాజకీయ తెర ‘ మీద సరికొత్త సీన్ కనిపించింది. ప్రభుత్వం ఏర్పాటు విషయంలో బీజేపీ-శివసేన మధ్య ‘ చెలిమి ‘ చెడిందని, అందువల్లే సేన-కాంగ్రెస్-ఎన్సీపీ చేతులు కలిపాయని వార్తలు వఛ్చినప్పటికీ..వాటిని ‘ గాలి కబుర్లు ‘గా కొట్టివేస్తూ ఎన్సీపీ- బీజేపీ కొత్త మైత్రికి తెర తీయడం అత్యంత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ కూడా ఏ పార్టీ కూడా తమకు మెజారిటీ ఉందని నిరూపించుకోలేకపోయిందని, అందువల్ల రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రానికి సిఫారసు చేసిన వ్యక్తి.. ఇప్పుడు హఠాత్తుగా బీజేపీని ఆహ్వానించడంలోని మతలబు ఏమిటన్నది మిస్టరీగా మారింది. తన మేనల్లుడు అజిత్ పవార్ బీజేపీతో చేతులు కలుపుతాడని తాను ఊహించలేదని శరద్ పవార్ అంటున్నారు. కమలం పార్టీకి మద్దతునివ్వాలన్నది ఆయన సొంత నిర్ణయమని, ఎన్సీపీకి దానితో సంబంధం లేదని పవార్ చెబుతున్నారు. అజిత్ నిర్ణయాన్ని నేను సపోర్ట్ చేసే ప్రసక్తే లేదు అన్నారు. అయితే ఆయన మాటలను ఎవరూ విశ్వసించడం లేదు. తనకు రాష్ట్రపతి పదవిని ఇచ్చేందుకు బీజేపీ సుముఖంగా ఉందన్న వార్తలు వచ్చినా అయన వాటిని ఖండించ లేదు. ఆ మధ్య ‘ మహా ‘ రాజకీయం ఇన్ని మలుపులు తిరుగుతున్నా ఆయన ఢిల్లీలో ప్రధాని మోదీని కలుసుకోవడం అప్పుడే సేన-కాంగ్రెస్ వర్గాల్లో సందేహాలను లేవనెత్తింది. ఓవైపు కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమవుతూనే పవార్ ‘ చక్రం ‘ తిప్పారని , ఇందుకు బీజేపీ అధ్యక్షుడు, హోం మంత్రి అమిత్ షా కూడా చొరవ చూపారని తెలుస్తోంది. రాష్టంలో రైతుల ప్రయోజనాలకు ఉద్దేశించిన ప్రాజెక్టుల విషయమై తాను మోదీతో చర్చించానని పవార్ చెబుతున్నప్పటికీ.. హఠాతుగా ఆయనకు రైతులమీద ఇంత ‘ ప్రేమ ‘ పుట్టుకురావడమేమిటన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. మరోవైపు ఈ నాటకీయ పరిణామాలన్నీ అమిత్ షాకు తెలుసునని, పవార్ మేనల్లుడు అజిత్ పవార్ ద్వారా ‘ ‘ గేమ్ ‘ ఆడించారని కూడా భావిస్తున్నారు. తాను మళ్ళీ సీఎం కావడం ఖాయమని దేవేంద్ర ఫడ్నవీస్ మొదటినుంచీ చెబుతూనే ఉన్నారుకూడా . .

.