Brahmamgari Matam: టీవీ సీరియల్ తలపిస్తున్న బ్రహ్మంగారి మఠాధిపతి వ్యవహారం.. మఠం పర్సన్‌ ఇన్‌ఛార్జిగా శంకర్‌ బాలాజీకి బాధ్యతలు

కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠాధిపతి ఎవరు? ఈ ప్రశ్న జరుగుతున్న పరిణామాలు కొట్లాటల వరకు వెళ్లాయి. సమాధానం మాత్రం దొరకడం లేదు.

Brahmamgari Matam: టీవీ సీరియల్ తలపిస్తున్న బ్రహ్మంగారి మఠాధిపతి వ్యవహారం.. మఠం పర్సన్‌ ఇన్‌ఛార్జిగా శంకర్‌ బాలాజీకి బాధ్యతలు
Sri Potuluri Veerabrahmamgari Matam
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 14, 2021 | 3:24 PM

Shankar Balaji as Brahmamgari Matam person in charge: కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠాధిపతి ఎవరు? ఈ ప్రశ్న జరుగుతున్న పరిణామాలు కొట్లాటల వరకు వెళ్లాయి. సమాధానం మాత్రం దొరకడం లేదు. చిక్కుముడి వీడుతుందా .. ఎక్కడ మొదలైన వివాదం ఎటుపోతోంది? చివరకు తోపులాటల వరకు వెళ్లింది. పోలీసుల ఎంట్రీతో సద్దుమణిగింది. చివరికి బ్రహ్మంగారిమఠం పర్సన్‌ ఇన్‌ఛార్జిగా శంకర్‌ బాలాజీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మఠం కార్యాలయంలో ఉదయం ఆయన బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం ఆలయ మేనేజర్‌ ఈశ్వరాచారి నుంచి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. కడప దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న శంకర్ బాలాజీని బ్రహ్మంగారిమఠం పర్సన్‌ ఇన్‌ఛార్జిగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పీఠాధిపతి వివాదం నేపథ్యంలో సర్కార్‌ ఆయనకు మఠం బాధ్యతలను అప్పగించింది.

ఇదిలావుంటే, మఠాధిపతి ఎవరనే వివాదం జీడిపాకం సీరియల్‌ను తలపిస్తోంది. ఈ గొడవకు ముందు చాలా ఎపిసోడ్లు నడిచాయి. వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి పెద్ద కుమారుడు వెంకటాద్రి వర్స్ రెండో భార్య మారుతి మహాలక్షుమ్మ మఠాధిపతి విషయంలో వివాదం కొనసాగుతోంది. వారసుడిగా మఠాధిపతిని నేనే అన్నది వెంకటాద్రి స్వామి వర్షన్. వీలునామా ప్రకారం తన కుమారుడు అవుతాడని మహాలక్షుమ్మ వాదన.

ఈ నేపథ్యంలో శివస్వామి చేసిన ప్రకటన మరింత అజ్యం పోసింది. పెద్దభార్యనే ధర్మపత్ని అవుతుందని.. ఆమె సంతానానికే వారసత్వం వస్తుందంటూ వెంకటాద్రి స్వామికి జైకొట్టారాయన. అదే టైంలో మఠంలో దుష్టశక్తులు, అవినీతి కుట్రలంటా రెండో భార్య మారుతి మహాలక్షుమ్మను టార్గెట్‌ చేయడం విశ్వబ్రాహ్మణులకు నచ్చలేదు. దీంతో.. శ్రీకాంత్ డైరెక్షన్‌లో కొందరు మఠం చేరుకున్నారు. అయితే.. వాళ్లు వెంకటాద్రి స్వామికి వ్యతిరేకం అనే అభిప్రాయంతో విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ శ్రీకాంత్ మీడియా సమావేశాన్ని అడ్డుకున్న గ్రామస్తులు. ఏకంగా దాడికి యత్నించారు.

ధర్మాన్ని నిలబెట్టేందుకు నేనున్నానంటూ సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు శివస్వామిని గ్రామంలోకి గ్రామస్తులు అనుమతించలేదు. చివరికి నిబంధనల మేరకు శివస్వామి బృందాన్ని మఠంలోకి రానిచ్చారు. వెంకటేశ్వర స్వామి కుటుంబ సభ్యులతో, గ్రామస్తులతో మాట్లాడిన శివస్వామి.. మఠాధిపతిని నిర్ణయిస్తామంటూ ప్రకటించారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్లు ప్రకటించేస్తే మేమెందుకన్నది దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెలిబుచ్చిన ధర్మ సందేహం. బుక్కులో సెక్షన్లు చదివి వినిపించారు. ప్రభుత్వం ఓ కమిటీ తేలుస్తుందని సెలవిచ్చారు.

పెద్దభార్యనే ధర్మపత్నిగా గుర్తిస్తారని.. ఆమె సంతానానికే వారసత్వం వస్తుందని శివస్వామి మరో ప్రకటన. మహాలక్షుమ్మ చూపిస్తున్న వీలునామా చెల్లదనేశారు. ఆమాట చెప్పడానికి శివస్వామి ఎవరన్నది మారుతి మహాలక్షుమ్మ సూటిప్రశ్న. మఠంలో దుష్టశక్తులు ఉన్నాయి.. అవినీతి జరుగుతోందంటూ శివస్వామి కేసు పెట్టగా.. తాము కోర్టుకు వెళ్లేందుకు రెడీ అన్నారు మహాలక్షుమ్మ.

చివరికి ఈ సీరియల్‌కు శుభంకార్డు ఎప్పుడు? ఎలా ఉంటుంది? అందరిలోను ఇదే ఉత్కంఠ కొనసాగుతోంది. పర్సన్‌ ఇన్‌ఛార్జిగా ప్రభుత్వం నియమించిన శంకర్ బాలాజీ మఠానికి చేరుకున్నారు. నెలరోజుల్లో తేల్చాస్తానంటూ డేట్‌ ఫిక్స్‌ చేశారాయన. అవినీతిని కూడా కడిగిపారేస్తామన్నారు.

Read Also…  Krishna District: కరోనాతో మరణించినవారి అంత్యక్రియలకు ఏపీ ప్రభుత్వ సాయం.. అప్లై చేసుకునే విధానం ఇది