AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. షకీబ్‌కు ఊరట..

బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబుల్ హాసన్‌పై ఐసీసీ విధించిన నిషేధం గురువారం(అక్టోబర్ 29)తో ముగిసింది. దీనిపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు హర్షం వ్యక్తం చేసింది.

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. షకీబ్‌కు ఊరట..
Ravi Kiran
|

Updated on: Oct 30, 2020 | 3:02 PM

Share

Shakib Al Hasan: బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబుల్ హాసన్‌పై ఐసీసీ విధించిన నిషేధం గురువారం(అక్టోబర్ 29)తో ముగిసింది. దీనిపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు హర్షం వ్యక్తం చేసింది. ” తమ జట్టు ఉత్తమ ఆటగాడు తిరిగి మైదానంలోకి అడుగుపెట్టబోతున్నాడు.. ప్రస్తుతానికి అంతర్జాతీయ సిరీస్‌లు ఏమి లేకపోవడంతో అతడు.. తనకు తాను దేశీయ టోర్నమెంట్లకు సిద్దం కావాలి. షకీబ్ తిరిగి ఫామ్‌లోకి రావడానికి ఎక్కువ సమయం పట్టదని భావిస్తున్నట్లు” బీసీబీ చీఫ్ సెలెక్టర్ మిన్హజుల్ అబెదిన్ పేర్కొన్నాడు.

అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండా ఉండేందుకు మరో ఏడాది పాటు నిషేధం ఉన్నా.. ఇకపై దేశవాళీ క్రికెట్‌కు మాత్రం షకీబుల్ హాసన్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. కాగా, బుకీల గురించి బోర్డుకు సరైన సమయంలో సమాచారం ఇవ్వని కారణంగా గతేడాది అక్టోబర్‌లో ఐసీసీ అవినితీ నిరోధక శాఖ షకీబ్‌పై రెండేళ్ల నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

Also Read:

NASA: ఆ ఒక్క ఆస్టరాయిడ్‌తో.. భూమి మీద అందరూ కోటీశ్వరులే..!

టిఫిన్ తిని స్నానం చేస్తే.. ఆరోగ్య సమస్యలెన్నో వస్తాయట.!

గంగవ్వ బాటలో బిగ్ బాస్ హౌస్‌ను వీడిన నోయల్.!

Follow Us