AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భర్త మృతదేహం కోసం ఏడుగురు భార్యల కొట్లాట…!

ఓ వ్యక్తి మృతదేహం కోసం ఏడుగురు భార్యలు సిగపట్లకు దిగారు. ఏం చేయాలో అర్థంకాక పోలీసులు తలలు పట్టుకున్నారు. ఎవరికి మృతదేహం అప్పగించాలో అర్థంకాక బిక్క మొహాలు పెట్టారు. ఉత్తరాఖండ్‌లో జరిగిన ఈ విచిత్ర ఘటన హాట్‌టాపిక్ అయ్యింది. హరిద్వార్‌లోని రవిదాస్ బస్తీకి చెందిన పవన్ కుమార్ అనే 40 ఏళ్ల వ్యక్తి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఏం జరిగిందో ఏమో ఆదివారం విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడ్ని వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ చనిపోయాడు. పోలీసులు […]

భర్త మృతదేహం కోసం ఏడుగురు భార్యల కొట్లాట...!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 04, 2019 | 6:23 AM

Share

ఓ వ్యక్తి మృతదేహం కోసం ఏడుగురు భార్యలు సిగపట్లకు దిగారు. ఏం చేయాలో అర్థంకాక పోలీసులు తలలు పట్టుకున్నారు. ఎవరికి మృతదేహం అప్పగించాలో అర్థంకాక బిక్క మొహాలు పెట్టారు. ఉత్తరాఖండ్‌లో జరిగిన ఈ విచిత్ర ఘటన హాట్‌టాపిక్ అయ్యింది.

హరిద్వార్‌లోని రవిదాస్ బస్తీకి చెందిన పవన్ కుమార్ అనే 40 ఏళ్ల వ్యక్తి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఏం జరిగిందో ఏమో ఆదివారం విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడ్ని వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ చనిపోయాడు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి పోస్ట్‌మార్ట్ నిర్వహించారు. తర్వాత అసలు తంటా వచ్చిపడింది. మృతదేహాన్ని అప్పగించేందుకు కుటుంబ సభ్యులకు కబురు పంపారు.

పవన్ కుమార్ డెడ్‌బాడీ కోసం ముందు ఐదుగురు మహిళలు వచ్చారు. మా ఆయన అంటే..కాదు మా ఆయన అంటూ పెద్దగా ఏడవడం మొదలుపెట్టారు. ఆయన తమ భర్తేనని తమకు అప్పగించాలని పోలీసుల్ని కోరారు. ఈ గందరగోళం కొనసాగుతుండగానే మరో ఇద్దరు సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వారు కూడా ఇదే వాదనను వినిపించారు. మొత్తం ఏడుగురు వచ్చి మృతదేహం కోసం కొట్లాటకు దిగారు. తామందరం అతడి భార్యలమని చెప్పడంతో పోలీసులే కాదు స్థానికులు సైతం విస్మయానికి గురయ్యారు. దీంతో పోలీసులకు ఏం చేయాలో అర్థంకాలేదు.. వారికి సర్థిచెప్పాలని చూసినా ఫలితం దక్కలేదు.

పోలీసులు అందర్ని శాంతపరచడానికి కొద్దిగా సమయం పట్టింది. గొడవ కాస్త తగ్గిన తర్వాత అతడి అంత్యక్రియలు నిర్వహించారు. ఏడుగురి నుంచి వివరాలు సేకరించి.. తర్వాత అతడి భార్య ఎవరో తేలుస్తామని పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు ఆ ఏడుగురికి ఒకరి గురించి మరొకరికి తెలియదట. అందుకే పోలీసులు.. పవన్ కుమార్ బంధువులు, స్నేహితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. మొత్తానికి ఒక భర్త, ఏడుగురు భార్యల వింత ఘటన ఇప్పుడు హాట్‌టాపిక్ అయ్యింది.

Follow Us
ఇండియా ఈజ్ ప్యారడైజ్.. డాలర్ వద్దు రూపాయి ముద్దు అంటున్న..
ఇండియా ఈజ్ ప్యారడైజ్.. డాలర్ వద్దు రూపాయి ముద్దు అంటున్న..
శ్రీహరి లేకుంటే మగధీర సినిమా లేదు.!
శ్రీహరి లేకుంటే మగధీర సినిమా లేదు.!
ప్రముఖ ఆధ్యాత్మిక నగరంలో ఉల్లిపాయల నిషేధం వెనుక కారణం ఏమిటి?
ప్రముఖ ఆధ్యాత్మిక నగరంలో ఉల్లిపాయల నిషేధం వెనుక కారణం ఏమిటి?
పాము మీ ఇంట్లో ఉంటే కనిపించే సంకేతాలు ఇవే.. లైట్ తీసుకుంటే..
పాము మీ ఇంట్లో ఉంటే కనిపించే సంకేతాలు ఇవే.. లైట్ తీసుకుంటే..
సాధారణ రైలు, వందే భారత్‌ లోకో పైలెట్ల జీతాల్లో తేడా ఉంటుందా?
సాధారణ రైలు, వందే భారత్‌ లోకో పైలెట్ల జీతాల్లో తేడా ఉంటుందా?
తెల్ల జుట్టును నల్లగా మార్చే మ్యాజిక్ పౌడర్.. నూనెతో కలిపి రాస్త
తెల్ల జుట్టును నల్లగా మార్చే మ్యాజిక్ పౌడర్.. నూనెతో కలిపి రాస్త
సహజంగా బరువు తగ్గాలనుకునే వారికి ఈ గింజలు వరం
సహజంగా బరువు తగ్గాలనుకునే వారికి ఈ గింజలు వరం
ఏపీలోని డ్వాక్రా మహిళల అకౌంట్లోకి డబ్బులు.. ఎప్పుడంటే..?
ఏపీలోని డ్వాక్రా మహిళల అకౌంట్లోకి డబ్బులు.. ఎప్పుడంటే..?
కర్ణాటక మహిళకు షాక్ ఇచ్చిన ఆటో డ్రైవర్ మంచితనం.. పోలీసుల ప్రశంసలు
కర్ణాటక మహిళకు షాక్ ఇచ్చిన ఆటో డ్రైవర్ మంచితనం.. పోలీసుల ప్రశంసలు
శోభన్ బాబు చనిపోయే ముందు చివరిగా ఫోన్ చేసి చెప్పిన మాట ఇదే..
శోభన్ బాబు చనిపోయే ముందు చివరిగా ఫోన్ చేసి చెప్పిన మాట ఇదే..