పాకిస్తాన్ లోని పెషావర్ లో భారీ పేలుడు, 7 గురి మృతి, 70 మందికి గాయాలు

పాకిస్తాన్ లోని పెషావర్ లో గల ఓ మదర్సా వద్ద మంగళవారం జరిగిన భారీ పేలుడులో ఏడుగురు మరణించగా,  సుమారు 70 మంది గాయపడ్డారు. మృతుల్లో నలుగురు పిల్లలున్నారని పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు ఓ ప్లాస్టిక్ బ్యాగ్ లో ఉంచిన శక్తిమంతమైన పేలుడు పదార్థాలు పేలిపోయినట్టు వారు చెప్పారు.  చాలామంది కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరారు. ప్లాస్టిక్ బ్యాగ్ లో సుమారు 5 కేజీల పేలుడు పదార్థాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు తామే […]

పాకిస్తాన్ లోని పెషావర్ లో భారీ పేలుడు, 7 గురి మృతి, 70 మందికి గాయాలు
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Oct 27, 2020 | 11:51 AM

పాకిస్తాన్ లోని పెషావర్ లో గల ఓ మదర్సా వద్ద మంగళవారం జరిగిన భారీ పేలుడులో ఏడుగురు మరణించగా,  సుమారు 70 మంది గాయపడ్డారు. మృతుల్లో నలుగురు పిల్లలున్నారని పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు ఓ ప్లాస్టిక్ బ్యాగ్ లో ఉంచిన శక్తిమంతమైన పేలుడు పదార్థాలు పేలిపోయినట్టు వారు చెప్పారు.  చాలామంది కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరారు. ప్లాస్టిక్ బ్యాగ్ లో సుమారు 5 కేజీల పేలుడు పదార్థాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు తామే కారణమని ఇప్పటివరకు ఎవరూ ప్రకటించలేదని పోలీసులు పేర్కొన్నారు. గత ఆదివారం బెలూచిస్థాన్ లో జరిగిన మరో ఘటనలో పేలుడు పదార్థాలు పేలిపోయి ముగ్గురు చనిపోయారు. రాజకీయ పార్టీలు ర్యాలీలు నిర్వహిస్తుండగా భారీ సంఖ్యలో పోలీసు బలగాలు మోహరించిఉన్నప్పటికీ ఈ ఘటన జరిగింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu