చరిత్రలో అతిపెద్ద పతనం.. ఒకే రోజులో రూ.14 లక్షల కోట్ల నష్టం!

కోవిద్ 19 దెబ్బకి దేశీ స్టాక్ మార్కెట్ వణికిపోయింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పరిస్థితులు చోటుచేసుకుంటుండటంతో బెంచ్‌మార్క్ సూచీలు పేకమేడలా కూలిపోయాయి. ఇన్వెస్టర్ల సంపద ఒకే రోజు రూ.13.95 లక్షలు ఆవిరైంది.

చరిత్రలో అతిపెద్ద పతనం.. ఒకే రోజులో రూ.14 లక్షల కోట్ల నష్టం!
Follow us

| Edited By:

Updated on: Mar 23, 2020 | 6:12 PM

కోవిద్ 19 దెబ్బకి దేశీ స్టాక్ మార్కెట్ వణికిపోయింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పరిస్థితులు చోటుచేసుకుంటుండటంతో బెంచ్‌మార్క్ సూచీలు పేకమేడలా కూలిపోయాయి. ఇన్వెస్టర్ల సంపద ఒకే రోజు రూ.13.95 లక్షలు ఆవిరైంది. అంతేకాకుండా లోయర్ సర్క్యూట్ కారణంగా ట్రేడింగ్ 45 నిమిషాలపాటు ఆగిపోయింది.

అయితే.. కరోనా దెబ్బకి ఈ మధ్యే స్టాక్ మార్కెట్ కుప్పకూలిన విషయం తెలిసిందే. ట్రేడింగ్ మళ్లీ ప్రారంభమైన తర్వాత సెన్సెక్స్ ఏకంగా 4,035 పాయింట్ల మేర పతనమైంది. నిఫ్టీ కూడా 1,162 పాయింట్లు దిగజారింది. అంటే సూచీలు ఏకంగా 13 శాతానికి పైగా కుప్పకూలాయి. మార్కెట్ ఒక్క రోజులో ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి. చివరకు సెన్సెక్స్ 3,935 పాయింట్ల నష్టంతో 25,981 పాయింట్ల వద్ద, నిఫ్టీ 1,135 పాయింట్ల నష్టంతో 7,610 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. మార్కెట్‌కు ఇది 4 ఏళ్ల కనిష్ట స్థాయి కావడం గమనార్హం.

మరోవైపు.. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకం విలువ భారీగా నష్టపోయింది. అమెరికా డాలర్ తో పోలిస్తే 76 స్థాయికి పడిపోయింది. 1 రూపాయి తగ్గుదలతో 76.29 వద్ద కదలాడుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ (ముడి చమురు) ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 5.26 శాతం తగ్గుదలతో 25.59 డాలర్లకు క్షీణించింది.