అమెరికా వాయుసేన చీఫ్ గా నల్ల జాతీయుడు

అమెరికా వాయుసేన చీఫ్‌గా తొలిసారి ఓ నల్లజాతీయుడిని నియమించింది. జనరల్ చార్లెస్ బ్రౌన్ జూనియర్‌ను ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా నియమించాలన్న ప్రతిపాదనకు యూఎస్ సెనేట్ సంపూర్ణ మద్దతు.

అమెరికా వాయుసేన చీఫ్ గా నల్ల జాతీయుడు
Follow us

|

Updated on: Jun 10, 2020 | 9:21 PM

జాతివివక్షపై నిరసనలతో రగిలిపోతున్న అగ్రరాజ్యం అమెరికాలో ఓ నల్ల జాతీయుడికి అగ్ర తాంబులం ఇచ్చింది. దేశంలో విపక్ష లేదని నిరూపించుకునేందుకు ప్రయత్నించింది. తాజాగా అమెరికా వాయుసేన చీఫ్‌గా తొలిసారి ఓ నల్లజాతీయుడిని నియమించింది. జనరల్ చార్లెస్ బ్రౌన్ జూనియర్‌ను ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా నియమించాలన్న ప్రతిపాదనకు యూఎస్ సెనేట్ సంపూర్ణ మద్దతు తెలిపింది. అమెరికా చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి నల్లజాతీయుడిగా చార్లెస్ రికార్డు సృష్టించాడు. చార్లెస్ గతంలో యూఎస్ పసిఫిక్ ఎయిర్‌ఫోర్సెస్ కమాండర్‌గా పనిచేశాడు. జార్జ్ ఫ్లాయిడ్ మరణంతో అమెరికా అల్లాడుతున్న సమయంలోనే ఈ నియామకం చేపటడం విశేషం. దీంతో కొద్ది రోజులుగా అమెరికాలో జరుగుతున్న అల్లర్లు కొంత వరకు శాంతిస్తాయని శ్వేత సౌధం భావిస్తోంది.