రేపటి నుంచి సాధారణ భక్తులకు శ్రీవారి దర్శనాలు..

ట్రయల్ రన్ లో ఈరోజు 7200 మంది స్థానికులు శ్రీవారిని దర్శించుకున్నారు. రేపటి నుండి దేశవ్యాప్తంగా ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనాలు లభ్యం కానున్నాయి. కంటైన్మెంట్ జోన్లు, రెడ్ జోన్ లో ఉన్న భక్తులు శ్రీవారి దర్శనానికి రాకూడదని

రేపటి నుంచి సాధారణ భక్తులకు శ్రీవారి దర్శనాలు..
Follow us

| Edited By:

Updated on: Jun 10, 2020 | 9:31 PM

ట్రయల్ రన్ లో ఈరోజు 7200 మంది స్థానికులు శ్రీవారిని దర్శించుకున్నారు. రేపటి నుండి దేశవ్యాప్తంగా ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనాలు లభ్యం కానున్నాయి. కంటైన్మెంట్ జోన్లు, రెడ్ జోన్ లో ఉన్న భక్తులు శ్రీవారి దర్శనానికి రాకూడదని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు. రేపటి నుండి అలిపిరి తనిఖీ కేంద్రంలో భక్తులకు టీటీడీ థర్మల్ స్క్రీనింగ్ చేయనుంది. దర్శన టికెట్లు పొందిన భక్తుల వివరాలు సేకరించి రెడ్ జోన్లు, కంటైన్మెంట్ జోన్ల నుండి వచ్చిన వారిని వెనుకకు పంపనున్నారు. థర్మల్ స్క్రీనింగ్ లో అనుమానితులను గుర్తిస్తే వెంటనే క్వారంటైన్ కు పంపనున్నారు.

శ్రీవారి దర్శనాలకు వచ్చిన భక్తులకు ర్యాండమ్ గా కోవిడ్ టెస్టులు నిర్వహించనున్నారు. ఇందుకోసం స్విమ్స్ లో కోవిడ్ టెస్టులకు ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు చేశారు అధికారులు. ఆన్ లైన్ లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కోటా పూర్తయింది. ఆన్ లైన్ లో 60 వేల టికెట్లను కేవలం 30 గంటల్లో భక్తులు కొనుగోలు చేశారు. రేపటి నుండి ఆన్ లైన్ రూ.300 టికెట్ల ద్వారా శ్రీవారిని మూడువేల మంది భక్తులు దర్శించుకోనున్నారు. తిరుపతిలోని కౌంటర్ల ద్వారా శ్రీవారి ఉచిత దర్శన టోకన్లను టీటీడీ జారీ చేసింది. రోజుకు 3750 టికెట్లను జారీ చేసింది.

క్యూలైన్ల వద్ద భక్తులు బారులు తీరడంతో 17 వతేది వరకు ఉచిత దర్శన టోకన్లను టీటీడీ జారీ చేసింది. శ్రీవారిని ఉదయం 6:30 నుండి సాయంత్రం 7:30 వరకు భక్తులు దర్శించుకోనున్నారు. ఉదయం 6:30 నుండి గంటపాటు వీఐపీలకు దర్శనాలు అందుబాటులో ఉంటాయి.