Secunderabad Cantonment Board: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.
Secunderabad Cantonment Board: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈ సంస్థలో వివిధ...
Secunderabad Cantonment Board: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈ సంస్థలో వివిధ విభాగాల్లో కలిపి మొత్తం 24 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాళ్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అర్హత ఏంటన్న వివరాలు ఇప్పుడు చూద్దాం..
భర్తీ చేయనున్న ఖాళీలు అర్హతలు..
* అసిస్టెంట్ కంటోన్మెంట్ ప్రానర్, అసిస్టెంట్ ఇంజనీర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్, నర్స్, డ్రెస్సర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. * అసిస్టెంట్ కంటోన్మెంట్ ప్రానర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు బీఈ/బీటెక్ (సివిల్) ఉత్తీర్ణత అయి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. * అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు అప్లై చేసుకునే వారు బీఈ/బీటెక్ (సివిల్) ఉత్తీర్ణతో సాధించాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. * శానిటరీ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. * అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. * ఫార్మసిస్ట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు డీ ఫార్మసీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. * నర్సు పోస్టుకు బీఎస్సీ (నర్సింగ్) చేసి ఉండాలి. వయసు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. * ల్యాబ్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. * డ్రెస్సర్ పోస్టుకు అప్లై చేసుకునే వారు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణ పొంది ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. * వార్డ్ సర్వెంట్ పోస్టుకు 10వ తరగతిని అర్హతగా నిర్ధారించారు. అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు. * దరఖాస్తుల ఫీజును రూ. 500గా నిర్ణయించారు. * దరఖాస్తుల స్వీకరణకు 21-08-2021ని చివరి తేదీగా నిర్ణయించారు. * పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి..
AP Transco: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారీ వేతనంతో ఉద్యోగాల భర్తీకి ఏపీ ట్రాన్స్‌కో నోటిఫికేషన్