Rent Tiny Toilet: అద్దెకు టాయిలెట్.. ఫ్రిడ్జ్, వైఫై వంటి సౌకర్యాలు అదనం.. వారానికి రెంట్ రూ.5వేలు.. ఎక్కడంటే..
Rent Tiny Toilet: వ్యక్తి అవసరాలు, వ్యాపారాన్ని నేర్పిస్తాయి. కొన్ని అవసరాలు తీరడానికి సొంతగా లేనప్పుడు.. అద్దెకు తీసుకుని అవసరం తీర్చుకుంటాం.. ఇల్లు, స్థలం, కార్లు, వాహనాలు, బొట్లు, షాపులు ఇలా అనేకమైనవి
Rent Tiny Toilet: వ్యక్తి అవసరాలు, వ్యాపారాన్ని నేర్పిస్తాయి. కొన్ని అవసరాలు తీరడానికి సొంతగా లేనప్పుడు.. అద్దెకు తీసుకుని అవసరం తీర్చుకుంటాం.. ఇల్లు, స్థలం, కార్లు, వాహనాలు, బొట్లు, షాపులు ఇలా అనేకమైనవి అద్దెకు ఇస్తారు.. వాటిని మన అవసరాలకు వ్యాపారానికి అనుగుణంగా అద్దెకు తీసుకుని జీవితాన్ని గడిపేస్తాం… అయితే ఓ వ్యక్తి వినూత్నంగా ఆలోచించాడు.. టాయిలెట్స్ ను అద్దెకు ఇస్తానని ప్రకటించాడు.. ఇప్పటి వరకూ ఎవరికీ రాని ఈ ఆలోచన నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఒక్క టాయిలెట్ నే కాదు.. దీనితో పాటు వైఫై, రిఫ్రిజిరేటర్, టీ కెటిల్, టేబుల్, ఛైర్ సౌకర్యాలు కూడా ఉన్నాయని ప్రకటించాడు. ఇలా టాయిలెట్స్ ను అద్దెకిచ్చే వింత ఆలోచన స్కాట్ లాండ్ కు చెందిన వ్యక్తికీ కలిగింది. వివరాల్లోకి వెళ్తే..
గ్లాస్గోలోని పాట్రిక్‌కు చెందిన ఓ వ్యక్తి గమ్‌ట్రీ అనే ప్రాపర్టీ సైట్‌లో కొన్ని రోజుల క్రితం ఓ ప్రకటన ఇచ్చాడు. తన అపార్ట్‌మెంట్ బిల్డింగ్‌లో ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న టాయిలెట్‌ను అద్దెకు ఇస్తానని తెలిపాడు. అంతేకాదు బాత్ రూమ్ తో పాటు వైఫై, రిఫ్రిజిరేటర్, టీ కెటిల్,టేబుల్, ఛైర్ వంటి సౌకర్యాలు అదనం అని తెలిపాడు. ఇక ఈ టాయిలెట్ ను ఆఫీసుగా కూడా వాడుకోవచ్చునని సూచించాడు. ఈ టేబులెట్ కు వారానికి 50 స్టెర్లింగ్ పౌండ్‌ల అద్దె చెల్లించాల్సి ఉంటుందని చెప్పాడు.(అంటే వారానికి మన కరెన్సీలో రూ. 5,070 లు అన్నమాట). టాయిలెట్ అద్దెకు తీసుకోవాలని అనుకునేవారు తనను సోమవారం నుంచి శుక్రవారం వరకూ సంప్రదించవచ్చునని.. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 6 వరకూ అందుబాటులో ఉంటానని తెలిపాడు.
ఈ ప్రకటన పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అసలు టయిట్ల్స్ అద్దెకు ఇవ్వడమే వింత అంటే..దానికి మళ్ళీ వైఫై.. ఆఫీస్ అంటూ చెబుతున్నావు.. ఈ చెత్త ఐడియా నీకే వచ్చిందా లేక ఎవరైనా ఇచ్చారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎక్కువమంది పాట్రిక్ ఐడియాను ఎక్కువమంది విమర్శిస్తూ కామెంట్స్ చేయడంతో వెంటనే ఆ సైట్ నుంచి తన ప్రకటనను తొలగించాడు.
Also Read: Horoscope Today: ఈరోజు ఏ రాశివారికి అనుకూలంగా ఉంది.. ఏ రాశివారు విద్య ఉద్యోగాల్లో రాణిస్తారంటే..