A-74 Iceberg: ప్రపంచాన్ని భయపెడుతున్న మంచు కొండ.. సముద్రంలో పడితే ముప్పు తప్పదంటున్న శాస్త్రవేత్తలు

ఓ భారీ మంచు కొండ ఇప్పుడు ప్రపంచాన్నే భ‌య‌పెడుతోంది. అదిగానీ సముద్రంలో పడితే ముప్పు తప్పదని శాస్త్రవేత్తలు టెన్షన్ పడుతున్నారు. అంటార్కిటికా ఖండం మొత్తం మంచుతోనే కప్పబడి ఉంటుంది..

A-74 Iceberg: ప్రపంచాన్ని భయపెడుతున్న మంచు కొండ.. సముద్రంలో పడితే ముప్పు తప్పదంటున్న శాస్త్రవేత్తలు
World Largest Iceberg Break
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 24, 2021 | 8:08 AM

ఓ భారీ మంచు కొండ ఇప్పుడు ప్రపంచాన్నే భ‌య‌పెడుతోంది. అదిగానీ సముద్రంలో పడితే ముప్పు తప్పదని శాస్త్రవేత్తలు టెన్షన్ పడుతున్నారు. అంటార్కిటికా ఖండం మొత్తం మంచుతోనే కప్పబడి ఉంటుంది. ప్రపంచంలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు ఇక్కడే నమోదవుతాయి. తూర్పు అంటార్కిటికా ప్రాంతంలో మైనస్ 94 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఈ మంచు ప్రదేశంలో అప్పుడప్పుడు భారీ మంచుకొండలు విరిగి సముద్రంలో పడుతుంటాయి. ఈ సమయంలో ఆ ప్రాంతంలో సముద్ర మట్టం పెరుగుతుంటుంది.

తాజాగా వెడెల్ స‌ముద్రాన్ని అనుకోని ఉన్న మంచు కొండచరియ కూలి సముద్రంలో పడిపోయింది. ఇది ఢిల్లీ నగరమంతా పెద్దదిగా ఉండటం విశేషం. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో బ్రంట్ ఐస్ షెల్ఫ్ నుంచి 1270 చదరపు కిలోమీటర్ల పరిమాణంలో ఉన్న ఈ ఎ-74 విరిగిపడింది. ఎ-74 ఉన్న ప్రాంతంలో నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో అది వేరుపడిన బ్రంట్ ఐస్ షెల్ఫ్ ను ఢీకొనే ప్రమాదం ఉందని హిమానీనద శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇలా జరిగితే 1700 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల సైజులో ఉండే మ‌రో మంచు కొండ విడిపోతుంద‌ని భావిస్తున్నారు. ఇదే జరిగితే మంచుకొండలో మరిన్ని పగుళ్లు ఏర్పడి పర్యావరణానికి ముప్పుగా మారుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 150 మీటర్ల మందంతో ఉండే ఈ ఐస్ ముక్క సముద్రంలో పడితే సముద్ర మట్టం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

హిమానీనద నిపుణులు. తాజాగా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా సముద్రపుమట్టం పెరుగుదలపై నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. దాంట్లో కూడా ఆందోళనకర విషయాలు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి: Virat Kohli: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తాగే నీళ్ల బాటిల్‌ ధర ఎంతో తెలిస్తే షాకవుతారు.?

Salary Slipలో ఏముంటుంది.. HRA, TA , PF వీటిని ఎలా చూసుకోవాలి.. జీతానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా తెలుసుకోండి..