AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అన్‌లాక్ 2.0కు కేంద్రం రంగం సిద్ధం.. అనుమతి లేనివి ఇవే.!

అంతర్జాతీయ విమాన సర్వీసుల పునరుద్ధరణ మినహాయించి త్వరలోనే అమలు చేయనున్న అన్‌లాక్ 2.0 ప్రక్రియలో మరెలాంటి మార్పులు ఉండకపోవచ్చునని కేంద్ర అధికారిక వర్గాలు తెలియజేశాయి.

అన్‌లాక్ 2.0కు కేంద్రం రంగం సిద్ధం.. అనుమతి లేనివి ఇవే.!
Ravi Kiran
|

Updated on: Jun 28, 2020 | 11:18 AM

Share

అంతర్జాతీయ విమాన సర్వీసుల పునరుద్ధరణ తప్పితే అన్‌లాక్ 2 ప్రక్రియలో మరెలాంటి మార్పులు ఉండకపోవచ్చునని కేంద్ర అధికారిక వర్గాలు తెలియజేశాయి. ఇటీవల జరిగిన ఆల్ పార్టీ మీటింగ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో దశలవారీ లాక్ డౌన్ ముగిసిందని.. అన్‌లాక్ ప్రక్రియ మొదలైందని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. జూన్ 30వ తేదీతో అన్‌లాక్ 1 ముగుస్తుండటంతో.. అన్‌లాక్ 2లో కేంద్రం ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేస్తుందన్న దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

అయితే దేశాన్ని ఒకవైపు నుంచి కరోనా.. మరోవైపు నుంచి రుతుపవనాలు కమ్మేస్తుండటంతో.. కొద్దిరోజుల్లో ప్రకటించే అన్‌లాక్ 2 మార్గదర్శకాల్లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చునని.. స్కూళ్లు, కాలేజీలు, థియేటర్లు మరికొన్ని రోజులు మూసివేయబడే ఛాన్స్ ఉందని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరి వెల్లడించారు. దేశంలో సుమారు 85 శాతం కరోనా కేసులు ప్రధాన నగరాల్లోనే నమోదవుతుండటంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకునే దిశగా కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

అన్‌లాక్ 2లో అంతర్జాతీయ విమాన సర్వీసులు పున: ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జూలై 15 వరకు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ నిలిపేసినప్పటికీ.. కొన్నింటిని “కేస్-టు-కేస్” ప్రాతిపదికన అనుమతించవచ్చని సివిల్ ఏవియేషన్ డైరెక్టరేట్ జనరల్ చెప్పిన సంగతి విదితమే. ఏది ఏమైనా అన్‌లాక్ 2లో మాత్రం పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు తిరిగి తెరిచే అవకాశం ఉండదని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

“అన్‌లాక్ 1.0, అన్‌లాక్ 2.0 మార్గదర్శకాల మధ్య తేడా ఉండే అవకాశం లేదు. పాఠశాలలు, కళాశాలలు, సినిమా హాళ్లు మూసివేయబడటం తప్ప వేరే కొత్తగా ఏం ఉంది.? కొన్ని ప్రదేశాల్లో మాల్స్ సైతం తెరుచుకుంటున్నాయి. అన్‌లాక్ 2.0లో కేంద్రం మాత్రం ఎలాంటి మార్పులు చేయడానికి సిద్ధంగా లేదని అధికారి తెలిపారు. అయితే, కర్ఫ్యూ సమయాల్లో కొన్ని మార్పులు ఉండే ఛాన్స్ ఉండవచ్చునని ఆయన వెల్లడించారు.

ఇది చదవండి: కరోనా విజృంభణ.. ఏపీలో 12 వేలు, తెలంగాణలో 13 వేలు పాజిటివ్ కేసులు..