ట్విట్టర్​ నుంచి అదిరిపోయే ఫీచర్..​​ చూశారా..!

ట్విట్టర్​ నుంచి అదిరిపోయే ఫీచర్..​​ చూశారా..!

డార్లింగ్ ప్ర‌భాస్ న‌టించిన‌ మిస్టర్​ ఫర్​ఫెక్ట్ సినిమాలో కాజల్​కు… ప్రభాస్​ బ‌ర్త్ డే విషెస్ చెప్పే సీన్​ గుర్తుందా? ఆ సన్నివేశంలో ముందుగానే తన ల్యాప్​టాప్​లో ఓ వీడియో షూట్ చేసి.. కావాల్సిన టైమ్ కి గ్రీటింగ్స్ వెళ్లేలా సెట్​ చేస్తాడు. తెలిసిన సీనే మ‌ళ్లీ ఎందుకు చెబుతున్నామ‌నేగా మీ డౌబ్ట్! సరిగ్గా అలాంటి ఫీచర్​ను త్వరలో మీ ముందుకు తీసుకురానుంది సోష‌ల్ మీడియా దిగ్గజం ట్విట్టర్​. ప్రస్తుతం ఈ షెడ్యూల్​ ఫీచర్.. డెస్క్​టాప్​లో ‘ట్విట్టర్ ఫర్ […]

Ram Naramaneni

|

May 10, 2020 | 10:49 PM

డార్లింగ్ ప్ర‌భాస్ న‌టించిన‌ మిస్టర్​ ఫర్​ఫెక్ట్ సినిమాలో కాజల్​కు… ప్రభాస్​ బ‌ర్త్ డే విషెస్ చెప్పే సీన్​ గుర్తుందా? ఆ సన్నివేశంలో ముందుగానే తన ల్యాప్​టాప్​లో ఓ వీడియో షూట్ చేసి.. కావాల్సిన టైమ్ కి గ్రీటింగ్స్ వెళ్లేలా సెట్​ చేస్తాడు. తెలిసిన సీనే మ‌ళ్లీ ఎందుకు చెబుతున్నామ‌నేగా మీ డౌబ్ట్! సరిగ్గా అలాంటి ఫీచర్​ను త్వరలో మీ ముందుకు తీసుకురానుంది సోష‌ల్ మీడియా దిగ్గజం ట్విట్టర్​.

ప్రస్తుతం ఈ షెడ్యూల్​ ఫీచర్.. డెస్క్​టాప్​లో ‘ట్విట్టర్ ఫర్ డెస్క్’ వాడే ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే ఈ ​ ​అందుబాటులో ఉంది. త్వరలో ఆండ్రాయిడ్​, ఐఓఎస్​ యూజర్లకు ఈ ఫీచర్​ను అందుబాటులోకి తీసుకురానున్న‌ట్లు ట్విట్ట‌ర్ వెల్ల‌డించింది. దీని ద్వారా ముందుగానే ట్వీట్​ రెడీ చేసుకొని.. అనుకున్న స‌మ‌యానికి సెండ్​ అయ్యే వెసులుబాటు ఉంటుంది. ట్వీట్​ వెళ్లే ముందు.. ఒకసారి సరిచేసేందుకూ ఛాన్స్ కల్పించనుంది. వీటిలో అసభ్యకర పదాలు, న్యూసుల‌ను గుర్తించేందుకు ఏఐ, ఎంఎల్​ టూల్స్​ను తయారు చేసినట్లు పేర్కొంది. అయితే.. ఈ ఎడిట్​ ఆప్షన్​ ప్రస్తుతం ఐఓఎస్​ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఇది ప్రయోగాత్మకంగా చేపడుతున్నామ‌ని.. సోషల్​ మీడియా మెనేజర్లు, మీడియా ప్రతినిధులకు ఈ ఫీచ‌ర్ ఎంతగానో యూజ్ అవుతోంద‌ని ట్విట్టర్​ భావిస్తోంది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu