తెలంగాణ‌లో ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు లాక్‌డౌన్ ఎత్తివేత ! నేటి నుంచే ప‌నులు ప్రారంభం

తెలంగాణ‌లో ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు లాక్‌డౌన్ ఎత్తివేత ! నేటి నుంచే ప‌నులు ప్రారంభం

తెలంగాణ ప్ర‌భుత్వం కూడా లాక్‌డౌన్ నిబంధ‌న‌ల్ని ఒక్కొక్క‌టిగా ఎత్తివేసే ప‌నిలో ప‌డింది. ఇందులో భాగంగానే ప్ర‌భుత్వ కార్య‌క‌లాపాల‌కు ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఇవాళ్టి నుంచి ప్ర‌భుత్వ ఉద్యోగులు ఆఫీసుల‌కు రానున్నారు.

Jyothi Gadda

|

May 11, 2020 | 7:07 AM

దేశంలో కొన‌సాగుతున్న మూడో ద‌శ లాక్‌డౌన్ ముగింపు ద‌శ‌కు చేరుకుంటోంది. దీంతో కొన్ని రాష్ట్రాలు ద‌శ‌ల వారిగా స‌డ‌లింపులు మొద‌లుపెడుతున్నాయి. ఈ క్ర‌మంలోనే తెలంగాణ ప్ర‌భుత్వం కూడా లాక్‌డౌన్ నిబంధ‌న‌ల్ని ఒక్కొక్క‌టిగా ఎత్తివేసే ప‌నిలో ప‌డింది. ఇందులో భాగంగానే ప్ర‌భుత్వ కార్య‌క‌లాపాల‌కు ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఇవాళ్టి నుంచి ప్ర‌భుత్వ ఉద్యోగులు ఆఫీసుల‌కు రానున్నారు. గ్రీన్‌, ఆరెంజ్ జోన్ల ప‌రిధిలో ఉన్న జిల్లాల్లోని ఉద్యోగులంతా విధుల‌కు రావాల‌ని  ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లా, డివిజ‌న్‌, మండ‌ల, గ్రామ స్థాయిలోని ప్ర‌భుత్వ కార్యాల‌యాన్ని నేటి నుంచి ప‌నిచేయ‌నున్నాయి. ప్ర‌భుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అంద‌రూ ప‌నిచేస్తారు.

తెలంగాణ‌లో ఈ నెల 29వ‌ర‌కు లాక్‌డౌన్ కొన‌సాగ‌నుంది. ప్ర‌స్తుతం అన్ని జోన్లలో వైద్య, ఆరోగ్యం, వ్యవసాయం, పోలీస్, రెవెన్యూ, మున్సిపల్‌ శాఖల ఉద్యోగులు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నారు. ఇవాళ్టి నుంచి రెడ్‌జోన్ జిల్లాల్లో ఈ శాఖల ఉద్యోగులు పూర్తిస్థాయిలో పనిచేస్తారు. మిగతా శాఖల ఉద్యోగులు మాత్రం రొటేషన్ పద్ధతిలో వస్తారు. 33 శాతం మంది మాత్రమే హాజరవుతారు. హైదరాబాద్ రెడ్ జోన్ పరిధిలో ఉంది కాబట్టి… ఇక్కడ రొటేషన్ పద్ధతి అమలవుతుంది. ఐతే… ఐటీ కంపెనీలు కూడా ఇవాళ ప్రారంభమవుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఈ నెల 15 సీఎం కేసీఆర్ రివ్యూ మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ తర్వాత… మరిన్ని సడలింపులు, మినహాయింపులు ఇచ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu