AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

11 మంది వలస కార్మికులకు కరోనా

వలస కార్మికుల వల్లనే ప్రస్తుతం వైరస్ కేసులు ఎక్కువ నమోదవుతున్ననేప‌థ్యంలో గ్రామాల వారీగా బయటనుండి వచ్చిన వారికి ..

11 మంది వలస కార్మికులకు కరోనా
Jyothi Gadda
|

Updated on: May 11, 2020 | 7:29 AM

Share
రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ త‌గ్గుముఖం ప‌ట్టింద‌ని అంతా అనుకుంటున్న వేళ వ‌ల‌స‌ల టెన్ష‌న్ మొద‌లైంది. లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో వివిధ రాష్ట్రాలకు వలస వెళ్లిన వారు తిరిగి రాష్ట్రంలో అడుగుపెట్టడంతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వర్గాల‌కు కొత్త త‌ల‌నొప్పిగా మారింది. ప్రత్యేక అనుమతులు తీసుకొని వేలాది మంది రైళ్లు, బస్సులు, సొంత వాహనాల్లో రాష్ట్రానికి చేరుకుంటున్నారు. ఇలా వచ్చిన వారిలో ఇప్పటిదాకా 11 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. వారంతా మహారాష్ట్ర నుంచి వచ్చిన వారుగా నిర్ధారించారు. ఆ సంఖ్య ఇంకా పెరుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
రాష్ట్రంలోకి వ‌స్తున్న వ‌ల‌స‌ల నేప‌థ్యంలో వైద్య ఆరోగ్య శాఖ మ‌రింత‌ అప్రమత్తం అయ్యింది. తెలంగాణలోకి  వస్తున్న ప్రతి ఒక్కరిపై దృష్టి పెట్టింది. బోర్డర్ లోనే ఉష్ణోగ్రత పరీక్షలు చేసి క్వారెంటైన్ స్టాంప్స్ వేసి వారు వెళ్తున్న గ్రామాల వైద్య సిబ్బందికి సమాచారం అందిస్తున్నారు. ఇలా వచ్చిన వలస కార్మికుల వల్లనే ప్రస్తుతం వైరస్ కేసులు ఎక్కువ నమోదవుతున్ననేప‌థ్యంలో గ్రామాల వారీగా బయటనుండి వచ్చిన వారికి పరీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర నుండి వచ్చిన వారికి పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలింది. వీరిలో మంచిర్యాల, యాదాద్రి భువనగిరి జిల్లాకి చెందిన 11 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వలస కార్మికుల పట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోకి వస్తున్న ప్రతి ఒక్కరినీ 14 రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచుతామని అధికారులు స్ప‌ష్టం చేశారు.

Follow Us
కొన్నేళ్ల తర్వాత పాకిస్థాన్ గడ్డపై అడుగు పెట్టనున్న భారత ఆటగాళ్లు
కొన్నేళ్ల తర్వాత పాకిస్థాన్ గడ్డపై అడుగు పెట్టనున్న భారత ఆటగాళ్లు
పార్క్ చేసిన కారులో వింత శబ్ధాలు.. దగ్గరకెళ్లి చూడగా షాక్!
పార్క్ చేసిన కారులో వింత శబ్ధాలు.. దగ్గరకెళ్లి చూడగా షాక్!
ఆసియా గేమ్స్ షెడ్యూల్ ఇదే.. టీమిండియాతో తలపడే జట్లు ఇవే..?
ఆసియా గేమ్స్ షెడ్యూల్ ఇదే.. టీమిండియాతో తలపడే జట్లు ఇవే..?
అప్పుడే ఓటీటీలోకి యశ్ 'టాక్సిక్'! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
అప్పుడే ఓటీటీలోకి యశ్ 'టాక్సిక్'! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
మంగళకరమైన రోజు మంగళవారం మీ రాశి ఎలా ఉందంటే..?
మంగళకరమైన రోజు మంగళవారం మీ రాశి ఎలా ఉందంటే..?
టెన్త్ అర్హతతో అంగన్‌వాడీ ఉద్యోగాలు.. సెప్టెంబర్ 18 వరకే ఛాన్స్‌!
టెన్త్ అర్హతతో అంగన్‌వాడీ ఉద్యోగాలు.. సెప్టెంబర్ 18 వరకే ఛాన్స్‌!
హీరోను చూసి పరాఠాలు.. తెలుపు మిస్సైందని ఎరుపుతోనే జర్నీ
హీరోను చూసి పరాఠాలు.. తెలుపు మిస్సైందని ఎరుపుతోనే జర్నీ
మహిళలకు గుడ్‌న్యూస్.. ఏపీలో మరో 913 ఆశావర్కర్ ఉద్యోగాలు!
మహిళలకు గుడ్‌న్యూస్.. ఏపీలో మరో 913 ఆశావర్కర్ ఉద్యోగాలు!
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..