భానుడి ప్రతాపానికి గురైన నెమలి.. సెలైన్ ఎక్కించిన వైద్యులు

రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి ప్రతాపానికి జనాలతో పాటు.. మూగ జీవాలు విలవిలలాడిపోతున్నాయి. ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు పడరాని ఇబ్బందులు పడుతున్నాయి. ఎక్కడైనా నీరు కనబడితే చాలు.. అక్కడ వాలిపోతున్నాయి. జనగామ జిల్లా శివారులో జాతీయ పక్షి నెమలి భానుడి భగభగను తట్టుకోలేకపోయింది. ఓ బోరు వద్ద నీరు ప్రవహిస్తుండటంతో అక్కడ కాసేపు సేదతీరింది. అయినప్పటికీ అది స్పృహ కోల్పోయింది. ఇది గమనించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలోని […]

భానుడి ప్రతాపానికి గురైన నెమలి.. సెలైన్ ఎక్కించిన వైద్యులు
TV9 Telugu Digital Desk

| Edited By:

May 11, 2019 | 5:24 PM

రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి ప్రతాపానికి జనాలతో పాటు.. మూగ జీవాలు విలవిలలాడిపోతున్నాయి. ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు పడరాని ఇబ్బందులు పడుతున్నాయి. ఎక్కడైనా నీరు కనబడితే చాలు.. అక్కడ వాలిపోతున్నాయి. జనగామ జిల్లా శివారులో జాతీయ పక్షి నెమలి భానుడి భగభగను తట్టుకోలేకపోయింది. ఓ బోరు వద్ద నీరు ప్రవహిస్తుండటంతో అక్కడ కాసేపు సేదతీరింది. అయినప్పటికీ అది స్పృహ కోల్పోయింది. ఇది గమనించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలోని అంబులెన్స్‌ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని.. ఆ నెమలికి చికిత్స అందించింది. ఆ నెమలికి సెలైన్ ఎక్కించి ఉష్ణతాపం నుంచి ఉపశమనం కలిగించారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu