AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇకపై నో హిట్ వికెట్.. ఐపీఎల్ ఫైనల్‌లో స్పెషల్ ప్లాన్‌తో బరిలోకి సాయి సుదర్శన్

Sai Sudharsan Hit Wicket Out: గుజరాత్ టైటాన్స్ వరుస విజయాల్లో సాయి సుదర్శన్ పాత్ర ఎనలేనిది. టెక్నికల్‌గా ఎంతో పటిష్టమైన ఈ యువ బ్యాటర్, తన చిన్న చిన్న లోపాలను సరిదిద్దుకుని ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లపై ఎలాంటి విద్వంసం సృష్టిస్తాడో చూడాలి.

ఇకపై నో హిట్ వికెట్.. ఐపీఎల్ ఫైనల్‌లో స్పెషల్ ప్లాన్‌తో బరిలోకి సాయి సుదర్శన్
Sai Sudharsan Hit Wicket Out
Venkata Chari
|

Updated on: May 30, 2026 | 5:56 PM

Share

Sai Sudharsan Hit Wicket Out: గుజరాత్ టైటాన్స్ యువ సంచలనం సాయి సుదర్శన్ తన అద్భుత ఫామ్‌తో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నప్పటికీ, వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విచిత్రమైన రీతిలో హిట్ వికెట్‌గా వెనుతిరగడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగబోయే మహా సమరానికి ముందు, ఈ పొరపాటు మళ్లీ జరగకుండా ఉండేందుకు తను సిద్ధం చేసుకున్న ఒక ప్రత్యేకమైన ప్రణాళికను సుదర్శన్ స్వయంగా వెల్లడించాడు.

శభాష్ గిల్.. కానీ సాయి సుదర్శన్ దేనిది?

రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై గుజరాత్ టైటాన్స్ సాధించిన అద్భుత విజయం క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించింది. గుజరాత్ జట్టు ఐపీఎల్ చరిత్రలో మూడోసారి ఫైనల్లోకి అడుగుపెట్టింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ సెంచరీతో చెలరేగి జట్టుకు తిరుగులేని విజయాన్ని అందించాడు. అయితే, గిల్ ఆడిన అద్భుత ఇన్నింగ్స్‌ను మరుగున పడేసేలా సాయి సుదర్శన్ అవుట్ అయిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. కేవలం 32 బంతుల్లోనే 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 58 పరుగులు చేసి జట్టును 10 వికెట్ల విజయతీరాలకు చేర్చేలా కనిపించిన సుదర్శన్, అనుకోకుండా చేతిలో నుంచి బ్యాట్ జారి స్టంప్స్‌పై పడటంతో హిట్ వికెట్‌గా వెనుతిరిగాడు.

క్రికెట్ చరిత్రలోనే అరుదైన విచిత్రం

దాదాపు 150 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ఆటగాడు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అవ్వడం ఎవరూ ఊహించని విషయం. రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో సాయి సుదర్శన్ అవుట్ అయిన తీరు చూసి కెప్టెన్ గిల్ సైతం నోరెళ్లబెట్టాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ తన దురదృష్టాన్ని నమ్మలేక మైదానంలోనే బిత్తరపోయాడు. అదృష్టవశాత్తూ గుజరాత్ అప్పటికే పటిష్టమైన స్థితిలో ఉండటంతో ఈ అవుట్ మ్యాచ్ ఫలితాన్ని శాసించలేదు. కానీ ఐపీఎల్ ఫైనల్ వంటి హై-ప్రెజర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడేటప్పుడు ఇలాంటి తప్పులు జరిగితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

సుదర్శన్ కొత్త ప్లాన్.. గ్రిప్ టెక్నాలజీతో చెక్!

ఈ విచిత్రమైన అవుట్లపై సాయి సుదర్శన్ మ్యాచ్ ముగిసిన తర్వాత చాలా సరదాగా స్పందించాడు. ఫైనల్ మ్యాచ్‌లో బ్యాట్ చేతిలో నుంచి జారిపోకుండా ఉండేందుకు తాను ఒక సరికొత్త మార్గాన్ని వెతకబోతున్నట్లు చెప్పాడు. “నేను ఖచ్చితంగా కొన్ని కొత్త విషయాలను ప్రయత్నించాలి. ముఖ్యంగా బ్యాట్ హ్యాండిల్‌కు ప్రత్యేకమైన ‘గ్రిప్ టెక్నాలజీ’ని ఉపయోగించి ప్రాక్టీస్ సెషన్‌లో కొన్ని బంతులను ఎదుర్కొంటాను. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఇలా ఎలా జరిగిందో నాకే అర్థం కావడం లేదు. గత మ్యాచ్‌లో బంతి స్టంప్స్‌కు తగిలింది, కానీ ఈ మ్యాచ్‌లో నేను బంతిని నేరుగా బాదాలని చూశాను, దురదృష్టవశాత్తు బ్యాట్ చేతిలో నుంచి జారిపోయింది” అని నవ్వుతూ చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్‌లో పరుగుల వరద.. క్రిస్ గేల్ సరసన రికార్డు..

ఈ హిట్ వికెట్ డ్రామాను పక్కన పెడితే, ప్రస్తుత సీజన్‌లో సాయి సుదర్శన్ ఆట తీరు అమోఘం. ఈ లీగ్‌లో 16 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 710 పరుగులు సాధించి, అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ సీజన్ ఆరంభంలో మొదటి ఆరు మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక్క హాఫ్ సెంచరీ చేసిన సుదర్శన్, ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుని జట్టుకు వెన్నెముకగా నిలిచాడు. ప్రస్తుతానికి వైభవ్ సూర్యవంశీని దాటి ఆరెంజ్ క్యాప్ అందుకోవడానికి సుదర్శన్ కేవలం 68 పరుగుల దూరంలో ఉన్నాడు. అంతేకాదు, ఐపీఎల్ చరిత్రలో వరుసగా రెండు సీజన్లలో 700 కంటే ఎక్కువ పరుగులు చేసిన రెండో ఆటగాడిగా క్రిస్ గేల్ సరసన సాయి సుదర్శన్ నిలిచాడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇకపై నో హిట్ వికెట్.. స్పెషల్ ప్లాన్‌తో బరిలోకి సాయి సుదర్శన్
ఇకపై నో హిట్ వికెట్.. స్పెషల్ ప్లాన్‌తో బరిలోకి సాయి సుదర్శన్
ముళ్ల పంది స్వయంగా వేటాడదు. కానీ తనపై దాడికి వస్తే మాత్రం..
ముళ్ల పంది స్వయంగా వేటాడదు. కానీ తనపై దాడికి వస్తే మాత్రం..
నువ్వేం మనిషి అంజయ్య.. అత్తగారు బైక్ కొనిపెట్టలేదని.. భార్యను..
నువ్వేం మనిషి అంజయ్య.. అత్తగారు బైక్ కొనిపెట్టలేదని.. భార్యను..
నెల రోజులు చక్కెర తీసుకోవడం మానేస్తే.. ఎంత బరువు తగ్గుతారో తెలుసా
నెల రోజులు చక్కెర తీసుకోవడం మానేస్తే.. ఎంత బరువు తగ్గుతారో తెలుసా
జుట్టు విపరీతంగా రాలిపోతోందా?ఈ ఒక్క హోమ్ రెమెడీతో చెక్ పెట్టండి!
జుట్టు విపరీతంగా రాలిపోతోందా?ఈ ఒక్క హోమ్ రెమెడీతో చెక్ పెట్టండి!
ఆకాశంలో బ్లూ మూన్ అద్భుతం.. రేపటి ఈ అరుదైన పౌర్ణమిని మిస్..
ఆకాశంలో బ్లూ మూన్ అద్భుతం.. రేపటి ఈ అరుదైన పౌర్ణమిని మిస్..
టీమిండియాలోకి వైభవ్.. సూర్య, గిల్‌ ఔట్.. జాబితా చూశారా?
టీమిండియాలోకి వైభవ్.. సూర్య, గిల్‌ ఔట్.. జాబితా చూశారా?
టెస్లా కార్లపై ఏకంగా రూ. 9 లక్షల తగ్గింపు.. ఎందుకో తెలుసా?
టెస్లా కార్లపై ఏకంగా రూ. 9 లక్షల తగ్గింపు.. ఎందుకో తెలుసా?
ఒకే టూర్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. సికింద్రాబాద్ నుంచి..
ఒకే టూర్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. సికింద్రాబాద్ నుంచి..
వేసవిలో ఈ పండు అమృతం!వడదెబ్బ,డీహైడ్రేషన్ నుండి రక్షణకు బెస్ట్
వేసవిలో ఈ పండు అమృతం!వడదెబ్బ,డీహైడ్రేషన్ నుండి రక్షణకు బెస్ట్