AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Quitting Sugar: నెల రోజులు చక్కెర తీసుకోవడం మానేస్తే.. ఎంత బరువు తగ్గుతారో తెలుసా?

Quitting Sugar For A Month? : ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఛాలెంజింగ్ అనే కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. నెటిజన్లు ఇచ్చే ఛాలెంజ్‌లను యాక్సెప్ట్‌ చేసి వాటిని పాటించడం ఈ కొత్త ట్రెండ్ పని.. అలా ఈ మధ్య ట్రెండింగ్‌లోకి వచ్చిన ఓ ఛాలెంజ్.. నో షుగర్ ఛాలెంజ్' అసలేంటి ఈ ఛాలెంజ్ అంటే.. నెల రోజుల పాటు మన తినే ఆహారంలో చక్కెరను పూర్తిగా తగ్గించడం వల్ల బరువు తగ్గడంతో పాటు చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుకోవచ్చట. ఇంతకూ అదెంతవరకు నిజం. దీనిపై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

Quitting Sugar: నెల రోజులు చక్కెర తీసుకోవడం మానేస్తే.. ఎంత బరువు తగ్గుతారో తెలుసా?
No Sugar Challenge
Anand T
|

Updated on: May 30, 2026 | 5:23 PM

Share

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ఛాలెంజ్ ప్రకారం.. నెల రోజుల పాటు చక్కెర కలిగిన ఆహారాలను దూరం పెడితే నిజంగానే బరువు ఎంత తగ్గుతారా అంటే అవుననే అంటున్నారు వైద్యులు. చక్కెర మానేసిన తర్వాత ఎంత బరువు తగ్గుతారనేది వ్యక్తి శారీరక శ్రమ, జీవక్రియ, నిద్ర, వారు తీసుకునే మొత్తం కేలరీలపై ఆధారపడి ఉంటుంది. కేవలం చక్కెర మానేసినంత మాత్రాన వేగంగా కొవ్వు కరిగిపోదు. అయితే, రోజూ సాఫ్ట్ డ్రింక్స్, స్వీట్లు, షుగర్ కాఫీలు ఎక్కువగా తాగే అలవాటు ఉన్నవారు వాటిని మానేస్తే.. కొన్ని వారాల్లోనే కొన్ని కిలోల బరువు తగ్గే అవకాశం ఉంది. కానీ, చక్కెర మానేసి దానికి బదులుగా అంతే కేలరీలు ఉండే ఇతర జంక్ ఫుడ్స్ తింటే మాత్రం ఎలాంటి ఫలితం ఉండదని నిపుణులు చెబుతున్నారు.

అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే చక్కెర తగ్గించిన మొదటి కొన్ని రోజుల్లో మీరు బరువు తగ్గినట్టు అనిపించవచ్చు.. అయితే తగ్గే బరువు కొవ్వు కాదు, అది శరీరంలోని ‘వాటర్ వెయిట్ మాత్రమే. శుద్ధి చేసిన పిండిపదార్థాలు, చక్కెర తగ్గించినప్పుడు బాడీలో గ్లైకోజెన్ నిల్వలు తగ్గుతాయి. దీనివల్ల ముఖం, శరీరంపై వాపు తగ్గి, కాస్త బరువు తగ్గినట్లు అనిపిస్తుంది.

బాడీలో కనిపించే మార్పులు

చక్కెర తినడం వల్ల మెదడులో ఆనందాన్ని ఇచ్చే రసాయనాలు విడుదలవుతాయి. అందుకే దాన్ని పదే పదే తినాలనిపిస్తుంది. మొదటి కొన్ని రోజులు ఇబ్బందిగా ఉన్నా, ఆ తర్వాత చక్కెర తినాలనే కోరిక క్రమంగా తగ్గిపోతుంది. పంచదార పదార్థాలు తిన్నప్పుడు వచ్చే ఎనర్జీ క్రాషెస్ తగ్గిపోతాయి. రోజంతా యాక్టివ్‌గా ఉండటంతో పాటు రాత్రి పూట మంచి నిద్ర పడుతుంది. భోజనం తర్వాత వచ్చే బద్ధకం దూరమవుతుంది.

చక్కెర వల్ల బరువు ఎందుకు పెరుగుతారు?

కూల్‌డ్రింక్స్, ప్యాక్ చేసిన జ్యూస్‌లు, స్వీట్లు, బేకరీ ఫుడ్స్‌లో ఉండే అదనపు చక్కెర వల్ల శరీరానికి ఎలాంటి పోషకాలు అందవు సరే కదా, కేలరీలు మాత్రం భారీగా పెరుగుతాయి. ముఖ్యంగా లిక్విడ్ రూపంలో తీసుకునే చక్కెర పానీయాలు కడుపు నిండిన భావనను కలిగించవు. దీనివల్ల శరీరంలో కొవ్వు, ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు పెరుగుతుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరిగి, అంతే వేగంగా పడిపోతాయి. దీనివల్ల మళ్లీ మళ్లీ ఆకలి వేయడం, అతిగా తినడం జరుగుతుంది. దీర్ఘకాలంలో ఇది టైప్-2 డయాబెటిస్ ముప్పును పెంచుతుంది.

పూర్తిగా మానేయడం కంటే తగ్గించడమే ముఖ్యం

అయితే చక్కెరను పూర్తిగా మానేయడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి లాంగ్ టర్మ్ రిజల్ట్స్ కోసం మీ రోజువారి జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వాటిలో ముఖ్యంగా కూల్ డ్రింక్స్, ప్యాకెట్ జ్యూస్‌లను పూర్తిగా పక్కన పెట్టడం, స్వీట్లు, డెజర్ట్‌లను తక్కువ మోతాదులో తీసుకోవడం, ఏదైనా ప్రొడక్ట్ కొనే ముందు దాని వెనుక ఉండే న్యూట్రిషన్ లేబుల్ చదివి, చక్కెర ఎంతుందో తెలుసుకోవడం, అలాగే రోజువారి భోజనంలో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ఇలా ఒక నెల రోజుల పాటు చక్కెరను తగ్గించడం వల్ల బరువు తగ్గడంతో పాటు మెటబాలిక్ హెల్త్ మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
నెల రోజులు చక్కెర తీసుకోవడం మానేస్తే.. ఎంత బరువు తగ్గుతారో తెలుసా
నెల రోజులు చక్కెర తీసుకోవడం మానేస్తే.. ఎంత బరువు తగ్గుతారో తెలుసా
జుట్టు విపరీతంగా రాలిపోతోందా?ఈ ఒక్క హోమ్ రెమెడీతో చెక్ పెట్టండి!
జుట్టు విపరీతంగా రాలిపోతోందా?ఈ ఒక్క హోమ్ రెమెడీతో చెక్ పెట్టండి!
ఆకాశంలో బ్లూ మూన్ అద్భుతం.. రేపటి ఈ అరుదైన పౌర్ణమిని మిస్..
ఆకాశంలో బ్లూ మూన్ అద్భుతం.. రేపటి ఈ అరుదైన పౌర్ణమిని మిస్..
టీమిండియాలోకి వైభవ్.. సూర్య, గిల్‌ ఔట్.. జాబితా చూశారా?
టీమిండియాలోకి వైభవ్.. సూర్య, గిల్‌ ఔట్.. జాబితా చూశారా?
టెస్లా కార్లపై ఏకంగా రూ. 9 లక్షల తగ్గింపు.. ఎందుకో తెలుసా?
టెస్లా కార్లపై ఏకంగా రూ. 9 లక్షల తగ్గింపు.. ఎందుకో తెలుసా?
ఒకే టూర్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. సికింద్రాబాద్ నుంచి..
ఒకే టూర్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. సికింద్రాబాద్ నుంచి..
వేసవిలో ఈ పండు అమృతం!వడదెబ్బ,డీహైడ్రేషన్ నుండి రక్షణకు బెస్ట్
వేసవిలో ఈ పండు అమృతం!వడదెబ్బ,డీహైడ్రేషన్ నుండి రక్షణకు బెస్ట్
పోస్టాఫీసులో రూ. లక్ష డిపాజిట్‌ చేస్తే రెండేళ్లకు ఎంత వస్తుంది?
పోస్టాఫీసులో రూ. లక్ష డిపాజిట్‌ చేస్తే రెండేళ్లకు ఎంత వస్తుంది?
ఐపీఎల్ హిస్టరీలోనే మోస్ట్ అన్‌లక్కీ ప్లేయర్ ఎవరో తెలుసా?
ఐపీఎల్ హిస్టరీలోనే మోస్ట్ అన్‌లక్కీ ప్లేయర్ ఎవరో తెలుసా?
ఇంటర్ పూర్తి చేశారా? కాలేజీ ఎంపికలో ఈ తప్పులు చేస్తే కెరీర్..
ఇంటర్ పూర్తి చేశారా? కాలేజీ ఎంపికలో ఈ తప్పులు చేస్తే కెరీర్..