మెరిసిన పడిక్కల్… ముంబై టార్గెట్ 165 పరుగులు

Mumbai Indians Target : అదిరే ఆరంభం దక్కినా మరోసారి బెంగళూరు భారీస్కోరు సాధించలేక చెతకిలపడింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 164 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్‌ దేవదత్‌ పడిక్కల్‌  45 బంతుల్లో 74 పరుగులను జోడించాడు. హాఫ్ సెంచరీతో అద్భుత ప్రదర్శనను చూపించాడు. మరో ఓపెనర్‌ ఫిలిప్ 24 బంతుల్లో 33 పరుగులు చేసి రాణించాడు. ఆ జట్టును బుమ్రా మంచి ప్రదర్శనతో దెబ్బతీశాడు. […]

  • Sanjay Kasula
  • Publish Date - 9:52 pm, Wed, 28 October 20
మెరిసిన పడిక్కల్... ముంబై టార్గెట్ 165 పరుగులు

Mumbai Indians Target : అదిరే ఆరంభం దక్కినా మరోసారి బెంగళూరు భారీస్కోరు సాధించలేక చెతకిలపడింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 164 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్‌ దేవదత్‌ పడిక్కల్‌  45 బంతుల్లో 74 పరుగులను జోడించాడు. హాఫ్ సెంచరీతో అద్భుత ప్రదర్శనను చూపించాడు. మరో ఓపెనర్‌ ఫిలిప్ 24 బంతుల్లో 33 పరుగులు చేసి రాణించాడు. ఆ జట్టును బుమ్రా మంచి ప్రదర్శనతో దెబ్బతీశాడు.

బెంగళూరు కుర్రాళ్లు పడిక్కల్‌, ఫిలిప్‌ ఆది నుంచే బౌండరీల వర్షం కురిపించారు. పవర్‌ప్లేలో వికెట్‌ నష్టపోకుండా 54 పరుగులను సాధించారు. అయితే రాహుల్ చాహర్‌ వేసిన 8వ ఓవర్‌లో ఫిలిప్‌ స్టంపౌటవ్వడంతో 71 పరుగుల వద్ద బెంగళూరు తొలి వికెట్‌ కోల్పోయింది.

తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ కేవలం సింగిల్ డిజిట్‌తో నిరాశపరిచాడు. మరోవైపు పడిక్కల్‌ బౌండరీలు సాధిస్తూ స్కోరుబోర్డు ముందుకు దూకించాడు. ఈ క్రమంలో 30 బంతుల్లో హాఫ్ సెంచరీ  పూర్తి చేశాడు.