Road Accident: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురి మృతి!
నల్గొండ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి..
Road Accident: నల్గొండ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి..
నల్గొండ జిల్లా అనుముల మండలం చింత గుడెం వద్ద ఈ ప్రమాదం జరిగింది. బైక్ పై వెళుతున్న ముగ్గురు వ్యక్తులపై టిప్పర్ లారీ దూసుకుపోవడంతో ముగ్గురూ అక్కడికక్కడే మరణించారు. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ వున్నవారు సమాచారం అందించడంతో సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టంనకు పంపించి కేసు విచారణ చేస్తున్నారు. మరణించిన ముగ్గురూ ఒకే బైక్ పై వెళుతున్నారు. వారెవరన్నది గుర్తించాల్సి ఉంది.
మరోవైపు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ క్రాస్ రోడ్డు వద్ద జరిగిన మరో ప్రమాదంలో నాలుగు సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. కంటైనర్ లారీ రోడ్డు పక్కన ఉన్న గుడిసెలోకి దూసుకుపోవడంతో ఈ ఘోరం చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.