నిజామాబాద్ జిల్లాలో విషాదం.. గోదావరి పుష్కరఘాట్‌లో ఆరుగురు మృతి.. దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్
నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడ్ పుష్కర ఘాట్ దగ్గర గోదావరి నదిలో గల్లంతైన ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి.
Six dies in godavari river: నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడ్ పుష్కర ఘాట్ దగ్గర గోదావరి నదిలో గల్లంతైన ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు సురేష్(40), యోగేష్ (16), శ్రీనివాస్((40), సిద్దార్థ్ (16), శ్రీకర్ (14), రాజు(24). వీరంతా మాక్లూర్ మండలం దీకంపల్లి, గుత్ప, నిజామాబాద్ నగరం లోని ఎల్లమ్మ గుట్టకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. మెండోరా మండలం పోచంపాడు వద్ద ఈ విషాదం నెలకొంది.
పోచంపాడు ప్రాజెక్టు దిగువన.. గోదావరిలో పుణ్యస్నానాల కోసం వచ్చిన ఏడుగురు వ్యక్తులు నదిలో గల్లంతు అయ్యారు. వీరిలో ఒకరు సురక్షితంగా బయటపడగా, మిగతా వారు గల్లంతు అయినట్లు పోలీసులు తెలిపారు. గల్లంతు అయిన వారి కోసం జాలర్ల సహాయంతో పోలీసులు బయటకు తీశారు. బాధితులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో ఆ కుటుంబం తీవ్ర దు:ఖసాగరంలో మునిగిపోయింది. సురక్షితంగా బయటపడిన వ్యక్తిని దర్పల్లి రవికాంత్(15)గా గుర్తించారు.
కాగా, పోచంపాడు పుష్కర ఘాట్‌లోఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి మరణం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాధిత కుటుంబ సబ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని సీఎం కేసీఆర్ కోరుకున్నారు. ఖమ్మం పర్యటనలో ఉన్న మంత్రి వేముల విషయం తెలిసిన వెంటనే తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. స్నానానికి గాను గోదావరి నదిలో దిగి దురదృష్టవశాత్తు ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలను అండగా ఉంటామన్నారు. గోదావరి నదిలో ఆరుగురు మృతి చెందడంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
Read Also…Benefits of Amaranth: ఈజీగా బరువు తగ్గాలనుకుంటున్నారా..! అయితే ఈ ఆకుకూరని ట్రై చేయండి