Wankidi Bridge : వాంకిడిలో బ్రిడ్జి కూల్చే సమయంలో ప్రమాదం.. శిథిలాల కింద ఇద్దరు కూలీలు, ఒకరు మృతి
Komaram bheem district wankidi Bridge collapse : కొమరం భీమ్ జిల్లా వాంకిడిలో పాత బ్రిడ్జి కుప్పకూలింది. ఫోర్ లైన్ రహదారి నిర్మాణ..
Komaram bheem district wankidi Bridge collapse : కొమరం భీమ్ జిల్లా వాంకిడిలో పాత బ్రిడ్జి కుప్పకూలింది. ఫోర్ లైన్ రహదారి నిర్మాణ పనుల కోసం పాత బ్రిడ్జిని కూల్చే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ఇద్దరు కూలీలు శిథిలాల కింద పడిపోయారు. అప్రమత్తమైన స్థానికులు, అధికారులు సహయక చర్యలు చేపట్టారు. అయితే అప్పటికే శిథిలాల మధ్య ఉపిరాడక ఒకరు చనిపోయారు. మరొకరు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో వెంటనే ఆసిఫాబాద్ ఆస్పత్రికి తరలించారు.
కాగా, వాంకిడి బ్రిడ్జి పాతబడడంతో కొత్త బ్రిడ్జి నిర్మించే పనిని ప్రారంభించారు అధికారులు. ఈ క్రమంలోనే పాత బ్రిడ్జి కూల్చేసి పక్కనే రోడ్డు వేయాలని భావించారు. కానీ అనుకుకోకుండా బ్రిడ్జి ఒక్కసారిగా నేలమట్టం అయింది. ప్రమాదాన్ని పసిగట్టేలోపే కూలీలు అరుపులు, కేకలు వేస్తూ కిందపడిపోయారు. స్థానికులిచ్చిన సమాచారంతో స్పాట్‌కు చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మరోవైపు, బ్రిడ్జి కూలడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. కాగా, అధికారుల పూర్తి నిర్లక్ష్యం వల్లే అమాయక కార్మికులు బలైపోయారని బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
Read also : S V University : ఎస్వీ యూనివర్శిటీలో నల్లమందు పేలుడు, కుక్క, పంది స్పాట్ డెడ్, క్యాంపస్ లో కోలాహలం