కొండెక్కిన ‘ఉల్లి’ ధర… సామాన్యుడి కంట కన్నీటి కలత!

ప్రభుత్వాల పతనాలకు కారణమైన ఉల్లి.. మళ్లీ తన ప్రతాపాన్ని చూపేందుకు సిద్ధమవుతోంది. ఉల్లిపాయ  మార్కెట్‌లో నాణ్యమైన ఉల్లిగడ్డ ధర కిలో రూ. 50 నుంచి రూ. 60 వరకు పలుకుతోంది. దీంతో భగ్గుమంటున్న ధరలను చూసి వినియోగదారులు ఉల్లిపాయలను కొనాలంటేనే భయపడుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఉల్లి పంట ప్రభావితమైంది. వర్షాలతో పంట దెబ్బతినడంతో… ఉల్లి దిగుబడి తగ్గింది. దీంతో… మార్కెట్లో ఉల్లి డిమాండ్ పెరగటం… అందుకు తగ్గ సరఫరా లేకపోవటంతో ధరలు భారీగా […]

కొండెక్కిన 'ఉల్లి' ధర... సామాన్యుడి కంట కన్నీటి కలత!
Follow us

| Edited By:

Updated on: Sep 22, 2019 | 12:07 PM

ప్రభుత్వాల పతనాలకు కారణమైన ఉల్లి.. మళ్లీ తన ప్రతాపాన్ని చూపేందుకు సిద్ధమవుతోంది. ఉల్లిపాయ  మార్కెట్‌లో నాణ్యమైన ఉల్లిగడ్డ ధర కిలో రూ. 50 నుంచి రూ. 60 వరకు పలుకుతోంది. దీంతో భగ్గుమంటున్న ధరలను చూసి వినియోగదారులు ఉల్లిపాయలను కొనాలంటేనే భయపడుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఉల్లి పంట ప్రభావితమైంది. వర్షాలతో పంట దెబ్బతినడంతో… ఉల్లి దిగుబడి తగ్గింది. దీంతో… మార్కెట్లో ఉల్లి డిమాండ్ పెరగటం… అందుకు తగ్గ సరఫరా లేకపోవటంతో ధరలు భారీగా పెరగటం మొదలైంది.  ప్రస్తుతం హోల్ సేల్ మార్కెట్లో కేజీ ఉల్లి రూ.50 నుంచి రూ.54 పలుకుతోంది. రిటైల్ మార్కెట్లో నాణ్యమైన ఉల్లి కేజీ రూ.60 వరకూ పలుకుతోంది.

గడిచిన రెండు వారాలుగా అంతకంతకూ పెరుగుతున్న ఉల్లి ధరలు ఇప్పట్లో తగ్గే సూచనలు లేవంటున్నారు. ఉల్లి పంట ఎక్కువగా ఉండే కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ నుంచి సరఫరా కావాల్సిన ఉల్లి కావాల్సినంత మేర రాకపోవటంతో ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మరోవైపు ఉల్లి రైతులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత రెండేళ్ల నష్టాల నుంచి గట్టెక్కామని ఆనందం వ్యక్తంచేస్తున్నారు. పేలటానికి సిద్ధంగా ఉన్న ‘ఉల్లి ధర’ బాంబును రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఉల్లి ధర పెరిగి.. ప్రజల్లో వ్యతిరేకత పెరిగే వరకూ వెయిట్ చేయకుండా.. ఇప్పటినుంచే అందుకు తగ్గ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటున్నారు.