Spicy Chilli Chicken: రెగ్యులర్ వంటలతో బోరు కొడుతుందా.. రెస్టారెంట్ స్టైల్ లో స్పైసీ చిల్లీ చికెన్ తయారు చేసి చూడండి

Spicy Chilli Chicken: రోజూ తినే ఆహారాన్నే ఆదివారం తినాలా అని పిల్లలే కాదు.. పెద్దలు కూడా అంటారు. రెస్టారెంట్ లో తినడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే ఈరోజు రెస్టారెంట్ స్టైల్ లో స్పైసీ చిల్లీ చికెన్..

Spicy Chilli Chicken: రెగ్యులర్ వంటలతో బోరు కొడుతుందా.. రెస్టారెంట్ స్టైల్ లో స్పైసీ చిల్లీ చికెన్ తయారు చేసి చూడండి
Chilli Chicken
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Surya Kala

Updated on: Jul 11, 2021 | 4:37 PM

Spicy Chilli Chicken: రోజూ తినే ఆహారాన్నే ఆదివారం తినాలా అని పిల్లలే కాదు.. పెద్దలు కూడా అంటారు. రెస్టారెంట్ లో తినడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే ఈరోజు చికెన్ ను రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ గా ఈజీగా టేస్టీ గా చిల్లీ చికెన్ ను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం

కావాల్సిన పదార్ధాలు :

బోన్ లెస్ చికెన్ – అరకిలో గుడ్డు – 1 కార్న్ ప్లోర్ – 2 స్పూన్స్ మైదాపిండి – ఒకటిన్నర స్పూన్ ధనియాల పొడి – అరస్పూన్ పెప్పర్ పౌడర్ – స్పూన్ జీలకర్ర పొడి – స్పూన్ అల్లం వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలు – 2 స్పూన్స్ పచ్చిమిర్చి – 2 నిలువుగా కట్ చేసుకున్నవి కారం – సరిపడా పసుపు – ఒక స్పూన్ నీళ్లు – 1 కప్పు ఉప్పు – రుచికి సరిపడా నూనె – తగినంత. టమోటా కెచప్ – అరకప్పు ఉలిపాయ -1

తయారీ విధానం:

ముందుగా చికెన్ ముక్కలను శుభ్రం చేసుకుని.. ఒక గిన్నె లో తీసుకుని చికెన్ ముక్కలకు గుడ్డుసొన, పెప్పర్ పౌడర్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరంమసాలా పొడి, కార్న్ ప్లోర్, మైదాపిండి, కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపినా చికెన్ మిశ్రమాన్ని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి.

ఒక గంట తర్వాత స్టౌ వెలిగించి బాణలి పెట్టుకుని అందులో వేయించడానికి సరిపడా నూనె వేసి.. చికెన్ ను ఎర్రగా వేయించుకోవాలి. వాటిని తీసుకుని పక్కకు పెట్టుకుని. నూనె లో అల్లంవెల్లులి ముక్కలు, పచ్చిమిర్చి, వేయించాలి. తర్వాత టమాట కెచప్ వేసి.. వేయించుకున్న చికెన్ ముక్కలు వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతే రెస్టారెంట్ స్టైల్ లో స్పైసీ చిల్లీ చికెన్ రెడీ.. తర్వాత కొంచెం ఉల్లి పాయ ముక్కలు.. నిమ్మకాయ తో సర్వ్ చేయాలి.

Also Read: బుల్లి తెరపై రికార్డ్ సృష్టించిన కార్తీక దీపం సీరియల్ .. వెండి తెరపై అడుగు పెట్టడానికి సన్నాహాలు