Edible Insects Food: మనదేశంలో చీమల చట్నీ, ఐస్ క్రీమ్, ఉసుళ్ల వేపుడు, పురుగుల పచ్చడి ఫేమస్ ఎక్కడంటే..

Edible Insects Food: చైనా, థాయిలాండ్ వంటి దేశాల్లో పాకేవి, ఈదేవి, ఎగిరేవి అనేవి తేడా లేకుండా అన్నిటిని తినేస్తారు. అయితే ప్రపంచంలో జనాభా రోజురోజుకీ..

Edible Insects Food: మనదేశంలో చీమల చట్నీ, ఐస్ క్రీమ్, ఉసుళ్ల వేపుడు, పురుగుల పచ్చడి ఫేమస్ ఎక్కడంటే..
Food Of The Future

Edible Insects Food: చైనా, థాయిలాండ్ వంటి దేశాల్లో పాకేవి, ఈదేవి, ఎగిరేవి అనేవి తేడా లేకుండా అన్నిటిని తినేస్తారు. అయితే ప్రపంచంలో జనాభా రోజురోజుకీ పెరిపోతుంది. అయితే పెరుగుతున్న జనాభకు సరిపడా ఆహారపదార్ధాలు దొరకడం రానున్న రోజుల్లో కష్టమని.. ఇతర ఆహారపు అలవాట్లు చేసుకోవాలని ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముంచుకొస్తున్న ఆహార సంక్షోభాన్ని కీటకాలే ప్రపంచాన్ని గట్టెక్కించబోతున్నాయని ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చరల్‌ ఆర్గనైజేషన్‌ తెలిపింది. ఇప్పటికే అనేక దేశాల్లో పురుగులు వంటకాలు చేసే స్టార్ హోటల్స్ ప్రత్యేక ఫుడ్ వింగ్స్ ఏర్పడుతున్నాయి. ఆ పురుగులను ఎంతో ఇష్టంగా తింటూ తమ ఫుడ్ మెనూలో ఓ ప్రధాన వంటకంగా చేర్చేశారు కూడా.. 2023 చివరి నాటికి తినదగిన కీటకాల ప్రపంచ మార్కెట్‌ 2 బిలియన్‌ డాలర్లకు చేరుకోనుందని అంచనా.

ఇక మనదేశంలో కూడా దాదాపు 10 రాష్ట్రాల్లోని కొన్ని గ్రామాల్లో, అడవుల్లో నివసించే ఆదివాసీలు కీటకాలను ఆహారంగా తీసుకుంటున్నారు. దాదాపు 300లకు పైగా కీటకాలను రకరకాలుగా వండుకుని తింటున్నారు. బస్తర్‌ ఆదివాసీలు వండుకొనే చీమల చట్నీలో, ఈత పురుగుల కూరలో పోషక విలువలు అపారం. వర్షాకాలంలో వచ్చే రోగాలను తట్టుకోవడానికి ఈ బలమైన ఆహారం. ఇక ఉసుళ్లతో చేసిన ఆహారం, వేపుళ్లు రుచిగా ఉండ‌ట‌మే కాదు, ఆరోగ్యానికి మంచిది కూడా. రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. సీజ‌న‌ల్ వ్యాధుల నుంచి ర‌క్షిస్తుంది.

ఇప్పటికీ అడవుల్లో నివసించే ఆదివాసీ తెగకు చెందినా కోయ, గోండు, కొండరెడ్లు, సుగాలి, కోలం, నాయక్‌పోడ్‌, అంధ్‌ వంటి వారు చీమల్ని ఆహారంగా తింటున్నారు. జార్ఖండ్‌లోని కోడా ఆదివాసీలైతే గత కొన్ని తరాల నుంచి బెమౌట్‌ చీమలను ఇష్టంగా తింటారు. ఇక చ‌త్తీస్‌గ‌డ్‌లోని ఆదివాసీలు ఆహారంగా తీసుకొనే చీమ‌ల చెట్నీ చాప్‌డా ని కార్పోరేట్ కంపెనీలు పెద్ద ఎత్తున మార్కెట్‌లో అమ్ముతున్నారు. ఈ చీమల చట్నీ రోగ నిరోధక శక్తిని పెంచుతుందట. చీమల పచ్చడి జ్వరం, జలుబు లాంటి అస్వస్థతలకు చక్కని మెడిసిన్ అని ఆదివాసీల నమ్మకం. ఎర్రచీమల్లో ఔషధ గుణాలు కలిగిన ఫార్మిక్‌ యాసిడ్‌, ప్రొటీన్లు, క్యాల్షియం ఉండటం వల్ల మలేరియా, కామెర్ల చికిత్సలో ఎర్ర చీమలను జోడిస్తారు. బతికున్న చీమ‌ల‌తో ఐస్‌క్రీమ్‌ కూడా ఫేమస్. ఒడిశాలోని కొన్ని జిల్లాల్లో ఖర్జూర పురుగుల లార్వా నుంచి అద్భుతమైన వంటకాన్ని చేస్తారు. అస్సాంలో ఎర్రచీమల లార్వాతోనూ పచ్చళ్లు పెడతారు. అమెరికాలో ఉప్పు మిడతల ప్రొటీన్‌ బార్‌లు చాలా పాపులర్‌. కొన్ని దేశాల్లో బొద్దింకల పాలతో చేసిన ఫుడ్ ఫేమస్. అయితే ప్రాచీన భారతంలో తినే ఆహారంలో కీటకాలు దాదాపు 2 వేల రకాలు ఉండేవట. కాలక్రమంలో వచ్చిన మార్పులతో ప్రస్తుతం ఇప్పుడు వాటి సంఖ్య 500 లకు పడిపోయింది. ఈ పుడ్ మెనూలో తేనెటీగలు, కందిరీగలు, చీమలు, మిడతలు, ఉప్పు మిడతలు, తూనీగలు, చెద పురుగులు వంటివి ఉండేవట.. అయితే మళ్ళీ భవిష్యత్ తరాలకు ఇవే మళ్ళీ ఆహారంగా మారవచ్చు అని ఐక్య రాజ్య సమితి చెబుతుంది.

Also Read:  యూకేని వణికిస్తున్న కొత్త వేరియంట్ ఏవై.4.2.. అమెరికా, రష్యా, ఇజ్రాయెల్‌ ల్లో కూడా కేసులు నమోదు..

.

Click on your DTH Provider to Add TV9 Telugu