RBI: షాకింగ్‌ న్యూస్‌.. ఇక ఆ డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు బంద్‌.. ఆదేశాలు జారీ చేసిన ఆర్బీఐ

RBI: ఇండియా సహా పలు దేశాల్లో వివిధ బ్యాంకుల ఖాతాదారులకు డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ఆర్థిక సేవలు అందించే మల్టీనేషనల్ సంస్థ 'మాస్టర్ కార్డ్'కు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ)..

RBI: షాకింగ్‌ న్యూస్‌.. ఇక ఆ డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు బంద్‌.. ఆదేశాలు జారీ చేసిన ఆర్బీఐ
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Subhash Goud

Updated on: Jul 14, 2021 | 9:29 PM

RBI: ఇండియా సహా పలు దేశాల్లో వివిధ బ్యాంకుల ఖాతాదారులకు డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ఆర్థిక సేవలు అందించే మల్టీనేషనల్ సంస్థ ‘మాస్టర్ కార్డ్’కు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) భారీ షాకిచ్చింది. దీనిపై ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. మాస్టర్‌ కార్డులపై ఆంక్షలు విధించింది. కొత్తగా డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు జారీ చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. కార్డు నెట్‌వర్క్‌లో కొత్త కస్టమర్లను పొందకుండా నియంత్రణలు విధించింది. ఆర్‌బీఐ విధించిన ఆంక్షలు జూలై 22 నుంచి అమలులోకి రానున్నాయి. అంటే జూలై 22 నుంచి మాస్టర్ కార్డు కొత్తగా డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు జారీ కావు.పేమెంట్ సిస్టమ్స్ డేటా స్టోరేజ్‌కి సంబంధించి ఆర్‌బీఐ రూపొందించిన నిబంధనలను మాస్టర్ కార్డు అతిక్రమించడం ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది.

మాస్టర్ కార్డ్ కంపెనీకి తగినంత సమయం, అవసరమైన అవకాశాలు ఇచ్చినా కూడా.. ఆ సంస్థ పేమెంట్ సిస్టమ్ డేటా స్టోరేజ్‌ ఆదేశాలకు అనుసరించలేదని ఆర్బీఐ వెల్లడించింది. అందుకే ఆ కంపెనీ కార్యకలాపాలపై ఆంక్షలు విధించామని ఆర్బీఐ తెలిపింది. కాగా ఆర్బీఐ నిర్ణయం వల్ల ప్రస్తుత మాస్టర్ కార్డు కస్టమర్లపై ఎలాంటి ప్రభావం పడదని గమనించాలి. అయితే పౌరుల వ్యక్తిగత డేటాను మరింత సురక్షితం చేసేలా బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసుల రంగానికి సంబంధించి మోదీ సర్కారు కొన్ని నిబంధనలను సవరించింది. దాని ప్రకారం.. దేశంలో ఆర్థిక సేవలు అందించే మాస్టర్ కార్డ్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, వీసా కార్డ్ తదితర సంస్థలు ఇక్కడ జరిగే పేమెంట్స్‌కు సంబంధించిన డేటాను దేశీయంగానే భద్రపరచాలనే నిబంధనను రూపొందించింది.

అయితే ఆర్బీఐ ఇచ్చిన గడువులోగా నిబంధనల పాలనలో విఫలం కావడంతో మాస్టర్ కార్డు పై ఆంక్షలు విధించారు. పేమెంట్స్‌ అండ్‌ సెటిల్‌మెంట్‌ సిస్టమ్స్‌ చట్టం 2007ను (పీఎస్‌ఎస్‌ చట్టం) అనుసరించి మాస్టర్ కార్డు సంస్థపై చర్యలు తీసుకున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. గతంలో అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌, డైనర్స్‌ క్లబ్‌ కార్డులపైనా ఆర్‌బీఐ ఈ తరహా ఆంక్షలనే విధించింది.

ఇవీ కూడా చదవండి:

India Post Payments Bank: పోస్టల్‌ బ్యాంకు ఖాతాదారులకు షాకింగ్‌ న్యూస్‌.. ఆగస్టు 1 నుంచి పెరగనున్న చార్జీలు

Bank Locker: మీకు బ్యాంకులో లాకర్‌ లభించడం లేదా..? అయితే ముందుగానే రిజిస్టర్‌ చేసుకోవచ్చు

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.