ట్రంప్ వల్ల పిల్లికి ప్రమాదం..!
మనలో చాలామందికి పిల్లులు అంటే ఇష్టం. కొంతమంది వాటిని పెంపుడు జంతువులుగా కూడా పెంచుకుంటారు. ఇక పిల్లుల్లో చాలా రకాల జాతులు ఉన్నాయని తెలిసిన విషయమే. వాటిల్లో ‘ఓసిలాట్’ అనే అడవి పిల్లుల జాతి ఒకటుంది. పెంపుడు పిల్లుల కంటే రెండు రేట్లు బరువు ఉండే ఈ జాతి పిల్లులు చిన్నసైజ్ చిరుతపులుల మాదిరి ఉంటాయి. ఇవి యునైటెడ్ స్టేట్స్, సెంట్రల్ అమెరికా, నార్త్ అమెరికా, మెక్సికో వంటి ప్రదేశాలలో సంచరిస్తాయి. ఇక అసలు విషయానికి వస్తే.. […]
మనలో చాలామందికి పిల్లులు అంటే ఇష్టం. కొంతమంది వాటిని పెంపుడు జంతువులుగా కూడా పెంచుకుంటారు. ఇక పిల్లుల్లో చాలా రకాల జాతులు ఉన్నాయని తెలిసిన విషయమే. వాటిల్లో ‘ఓసిలాట్’ అనే అడవి పిల్లుల జాతి ఒకటుంది. పెంపుడు పిల్లుల కంటే రెండు రేట్లు బరువు ఉండే ఈ జాతి పిల్లులు చిన్నసైజ్ చిరుతపులుల మాదిరి ఉంటాయి. ఇవి యునైటెడ్ స్టేట్స్, సెంట్రల్ అమెరికా, నార్త్ అమెరికా, మెక్సికో వంటి ప్రదేశాలలో సంచరిస్తాయి.
ఇక అసలు విషయానికి వస్తే.. రిమోట్ సెన్సార్ కెమెరాల ద్వారా అరిజోనా అడవులలో సంచరిస్తున్న అరుదైన ‘లిల్ జిఫ్’ అనే అడవి పిల్లి జాతిని కనుగొన్నారు పరిరక్షణ శాస్త్రవేత్తలు. ఈ జాతి పిల్లులు ఇంకా సంచరిస్తున్నాయి అని చెబుతూ ఒక వీడియో ని రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో చాతుర్యం పొందింది .
పరిశోధకులు చెబుతున్న కథనం ప్రకారం 2009 నుండి ఇప్పటివరకు ఈ జాతికి చెందిన ఐదు అడవి పిల్లులను ఉత్తర దిశ అరిజోనా లో కనుగొన్నాం అని అంటున్నారు.
రిలీజ్ చేసిన వీడియో ద్వారా అవి అరిజోనాలో ఉండే అవసరమైన వనరులను పొందుతూ జీవనం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. సగానికి పైగా అంతరించిపోయిన ఈ జాతి పిల్లులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్మిస్తున్న యు.ఎస్, మెక్సికో సరిహద్దు గోడ వల్ల వాటి మనుగడకు ప్రమాదం పొంచి ఉందని వారు భావిస్తున్నారు.