వైరల్‌గా మారిన రానా-మిహికా పోస్ట్‌ వెడ్డింగ్‌ ఫోటోలు

వైరల్‌గా మారిన రానా-మిహికా పోస్ట్‌ వెడ్డింగ్‌ ఫోటోలు

ఈ ప్రేమ జంట పోస్ట్‌ వెడ్డింగ్‌ కార్యక్రమాల్లో తెగ బిజీగా ఉంది. హైదరాబాద్‌లోని నివాసంలో రానా-మిహికా బజాజ్‌ సత్యనారాయణ వ్ర‌తంలో పాల్గొన్నారు. పూజ అనంతరం మిహికాకు రానా ల్యాప్‌టాప్‌లో...

Sanjay Kasula

|

Aug 12, 2020 | 8:00 PM

టాలీవుడ్ నూతన జంట రానా మిహికా దంపతుల ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఐదు రోజుల పెళ్లి వేడుక నుంచి ఇప్పటి వరకు ఈ ఇద్దరి ఫోటోలు ప్రత్యేక ఆకర్శనగా నిలుస్తున్నాయి. అందులోనూ బల్లాల దేవుడు మెచ్చిన బ్యూటీ ఫోటోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ కొత్త పెళ్లి కూతురు వెడ్డింగ్ కు ముందు జూవెలరీ ఫోటో సూట్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పుడు తాజాగా మరో ఫోటో కూడా సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది.

ఇప్పుడు ఈ ప్రేమ జంట పోస్ట్‌ వెడ్డింగ్‌ కార్యక్రమాల్లో తెగ బిజీగా ఉంది. హైదరాబాద్‌లోని నివాసంలో రానా-మిహికా బజాజ్‌ సత్యనారాయణ వ్ర‌తంలో పాల్గొన్నారు. పూజ అనంతరం మిహికాకు రానా ల్యాప్‌టాప్‌లో ఫొటోలు చూపిస్తుండగా.. వాటిని చూసి మిహికా నవ్వుతోంది. రానా-మిహికా సంప్రదాయ వస్త్రధారణలో పక్కపక్కనే కూర్చొని నవ్వుతున్న ఈ స్టిల్‌ ఇపుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

స‌త్య‌నారాయ‌ణ వ్ర‌తం త‌ర్వాత ఫ్యామిలీ అంతా నూత‌న వ‌ధూవ‌రుల‌తో క‌లిసి దిగిన ఫొటో ఇప్ప‌టికే నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ రూల్స్‌ను పాటిస్తూ..అతికొద్ది మంది కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో రానా-మిహికా పెండ్లి వేడుక జరిగిన సంగతి తెలిసిందే.  వీరి పెళ్లికి ఉపయోగించిన వర్చువల్ వెడ్డింగ్ కార్డ్ అందరని ఆకుంది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu