‘రొమాంటిక్’ మూవీలో శివగామి.. పాత్ర ఏమిటంటే?

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్డర్ పూరీ జగన్నాధ్ తనయుడు ఆకాశ్ పూరి, కేతికా శ‌ర్మ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం `రొమాంటిక్‌`. అనిల్ పాదూరి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ పతాకాల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ యువత గుండెల్లో కాక పుట్టించింది. `ఇస్మార్ట్ శంక‌ర్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత పూరి, ఛార్మి నిర్మిస్తున్న చిత్ర‌మిది. గతంలో పూరీ జగన్నాథ్.. […]

  • Tv9 Telugu
  • Publish Date - 4:12 pm, Wed, 16 October 19
'రొమాంటిక్' మూవీలో శివగామి.. పాత్ర ఏమిటంటే?

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్డర్ పూరీ జగన్నాధ్ తనయుడు ఆకాశ్ పూరి, కేతికా శ‌ర్మ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం `రొమాంటిక్‌`. అనిల్ పాదూరి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ పతాకాల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ యువత గుండెల్లో కాక పుట్టించింది. `ఇస్మార్ట్ శంక‌ర్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత పూరి, ఛార్మి నిర్మిస్తున్న చిత్ర‌మిది. గతంలో పూరీ జగన్నాథ్.. ఆకాశ్‌ను హీరోగా పరిచయం చేస్తూ మొహబూబా చిత్రాన్నితెరకెక్కించగా .. అది బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల ఇస్మార్ట్‌తో భారీ హిట్ అందుకున్న పూరీ, చార్మీలు కలిసి రొమాంటిక్‌గా దీన్ని తెరకెక్కిస్తున్నారు.

`బాహుబ‌లి` చిత్రంలో రాజ‌మాత శివ‌గామిగా మెప్పించిన రమ్యకృష్ణ రొమాంటిక్ మూవీలో కీల‌క పాత్ర‌లో కనిపించనున్నారు. . ఇందులో ర‌మ్య‌కృష్ణ లీడ్ రోల్‌ చేయనున్నట్టుగా తెలుస్తోంది. మంగ‌ళ‌వారం నుండి జ‌రుగుతున్న షెడ్యూల్‌లో ర‌మ్య‌కృష్ణ జాయిన్ అయ్యారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ క‌శ్య‌ప్ సంగీతాన్ని అందిస్తున్న ఈ ఇన్‌టెన్స్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ డిసెంబర్ నెలఖారుకు ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలుస్తోంది.