AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్యారమ్ బోర్డుకోసం త్రిపుల్ తలాఖ్.. ఆ మహిళ ఏం చేసిందంటే..?

క్యారమ్ బోర్డును తీసుకోలేదన్న కోపంతో ఒక భర్త తన భార్యకు ట్రిపుల్ తలాఖ్ చెప్పేశాడు. రాజస్థాన్‌లోని బారన్ జిల్లా కోటలో ఈ ఘటన చోటుచేసుకుంది. బారన్ జిల్లాలోని అంతా పట్టణంలో ఉంటున్న షబ్రూనిషా తన భర్త షకీల్ అహ్మద్ పై గతంలో గృహహింస కేసు పెట్టింది. భార్యభర్తలిద్దరికీ కుటుంబతగాదాలు ఉండటంతో ఆమె తన కుమారుడితో కలిసి తన పుట్టింట్లో ఉంటోంది. అయితే ఈ కేసుకు సంబంధించి మంగళవారం వారిద్దరూ కోర్టులో హాజరయ్యారు. ఇంటికి తిరిగి వస్తుండగా దారిలో […]

క్యారమ్ బోర్డుకోసం త్రిపుల్ తలాఖ్.. ఆ మహిళ ఏం చేసిందంటే..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 03, 2019 | 5:55 PM

Share

క్యారమ్ బోర్డును తీసుకోలేదన్న కోపంతో ఒక భర్త తన భార్యకు ట్రిపుల్ తలాఖ్ చెప్పేశాడు. రాజస్థాన్‌లోని బారన్ జిల్లా కోటలో ఈ ఘటన చోటుచేసుకుంది. బారన్ జిల్లాలోని అంతా పట్టణంలో ఉంటున్న షబ్రూనిషా తన భర్త షకీల్ అహ్మద్ పై గతంలో గృహహింస కేసు పెట్టింది. భార్యభర్తలిద్దరికీ కుటుంబతగాదాలు ఉండటంతో ఆమె తన కుమారుడితో కలిసి తన పుట్టింట్లో ఉంటోంది. అయితే ఈ కేసుకు సంబంధించి మంగళవారం వారిద్దరూ కోర్టులో హాజరయ్యారు. ఇంటికి తిరిగి వస్తుండగా దారిలో తమ కుమారుడికి క్యారమ్ బోర్డు కొనిస్తానని షకీల్ చెప్పారు. అందుకు ఆమె నిరాకరించడంతో కోపం పట్టలేక షకీల్ ఆమెకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు. కాగా, ట్రిపుల్ తలాఖ్ చెప్పే సాంప్రదాయాన్ని జూలై 30న పార్లమెంట్ చట్టం చేసిన విషయం తెలిసిందే. తాజాగా, మరోసారి షకీల్‌పై ట్రిపుల్ తలాక్ చెప్పాడని.. ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణ చట్టం కింద షకీల్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే అతడిని ఇంకా అరెస్టు చేయలేదు. ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత కోట ప్రాంతంలో ట్రిపుల్ తలాఖ్‌కు సంబంధించిన ఇది ఐదవ కేసు.

Follow Us
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా