వలస కార్మికులను అవమానించిన రైల్వే అధికారులకు నోటీసు..!
శ్రామిక్ రైల్లో ప్రయాణిస్తున్న వలస కూలీలకు అవమానం. ఇద్దరు రైల్వే అధికారుల సస్పెన్షన్
కరోనా వైరస్ దెబ్బకు ఉన్న ఉపాధి కోల్పోయి సొంతూర్లకు వెళ్లాలనుకునేవారికి అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయి. ఉన్నచోట నుంచి పయనం అవ్వడానికి కింద మీద పడి అనుమతి తీసుకుని రైలు ఎక్కడం ఒక తంతు అయితే ఇంటికి చేరాక క్వారంటైన్ పేరుతో నిర్బంధం మరో తంతు. అయితే, శ్రామిక్ రైల్లో ప్రయాణిస్తున్న వలస కూలీలు అవమానానికి గురయ్యారు. సొంతూర్లకు వెళ్తున్న వారిపట్ల రైల్వే సిబ్బంది ప్రవర్తించిన తీరు అందరి అశ్చర్యపరిచింది. తాజా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కరోనా దెబ్బకు అన్నీ రంగాలు కుదేలయ్యాయి. మళ్లీ సాధారణ స్థితికి రావాలంటే ఎంత సమయం పడుతుందో చెప్పలేమని నిపుణులు చేతులెత్తేస్తున్నారు. దీంతో వలస కూలీల పరిస్థితి దారుణంగా తయారైంది. చేసేందుకు పనిలేక.. తినేందుకు తిండిలేక.. ఊరెళ్లేందుకు బస్సులు లేక.. నడుచుకుంటూ తమ స్వగ్రామాలకు వెళుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం వలస కూలీల కోసం ప్రత్యేక శ్రామిక రైళ్లను ఏర్పాటు చేసింది. ఈ రైళ్లలో వలస కూలీలు తమ గమ్య స్థానాలకు వెళుతున్నారు. వెళుతూ వెళుతూ అవమానాల పాలవుతున్నారు. వలస కూలీల్ని గేలిచేస్తూ రైల్వే అధికారులు బిస్కట్ ప్యాకెట్లు విసిరేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఢిల్లీ నుంచి ఉత్తర ప్రదేశ్ లక్నోకు వలస కూలీలు కేంద్రం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లల్లో వెళుతున్నారు. ఈ క్రమంలో ఉత్తర్ ప్రదేశ్ ఫిరోజాబాద్ లో ఓ శ్రామిక్ రైల్ ఆగింది. రైల్ లోని వలసకూలీలు తమకు ఏదైనా ఆహారం కావాలని అడిగారు. అదే సమయంలో ఫిరోజాబాద్ రైల్వే అధికారి డీకే దీక్షిత్ వలస కూలీలకు బిస్కట్లు విసిరేస్తూ అవమానకరంగా అసభ్య పదజాలాన్ని ఉపయోగించాడు. “ఇప్పుడే ఒక బిస్కట్ ప్యాకెట్ ఇచ్చా…దాన్ని తినేసి మిగిలిన బిస్కట్లను షేర్ చేయండి” అంటూ దుర్బషలాడిన వీడియోలు వెలుగులోకి వచ్చింది. దీక్షిత్ తో పాటు మరో ఉద్యోగి వంతపాడుతూ అవమానించాడు. వలస కూలీలలను దూర్బష లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో రైల్వే ఉన్నతాధికారులు స్పందించారు. వలస కూలీల్ని అవమానించిన ఇద్దరు ఉద్యోగుల్ని సస్పెండ్ చేస్తూ షోకాజు నోటీసులు జారీ చేశారు.
#ShramikExpress: Viral video shows Firozabad Chief Inspector of Ticket throwing biscuits & cussing migrants, suspended. pic.twitter.com/KgHRZq74pC
— Mojo Story (@themojo_in) May 31, 2020