వీధి వ్యాపారులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్..

రైతులకు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహ పరిశ్రమలకు చేయూతను ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. తాజాగా కేంద్ర కేబినేట్ తీసుకున్న నిర్ణయాలను మంత్రి ప్రకాశ్ జవదేకర్ వివరించారు. స్ట్రీట్ వెండర్స్‌కు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది.

వీధి వ్యాపారులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్..
Follow us

|

Updated on: Jun 01, 2020 | 5:39 PM

రైతులకు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహ పరిశ్రమలకు చేయూతను ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. తాజాగా కేంద్ర కేబినేట్ తీసుకున్న నిర్ణయాలను మంత్రి ప్రకాశ్ జవదేకర్ వివరించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహ పరిశ్రమలకు.. రూ. 20 వేల కోట్ల ప్యాకేజ్‌కు కేబినేట్ ఆమోదం తెలిపిందన్న ఆయన.. ఈ ప్యాకేజ్ ద్వారా MSMEలకు సరికొత్త నిర్వచనం రానుందని వెల్లడించారు.

ఆర్ధిక వ్యవస్థ బలోపేతంలో MSMEలు కీలక పాత్ర పోషిస్తున్నాయని మంత్రి తెలిపారు. వాటి కోసం రూ. 50 వేల కోట్ల ఈక్విటీ పెట్టుబడులను పెడుతున్నట్లు స్పష్టం చేశారు. దీని ద్వారా దేశంలోని 6 కోట్ల MSMEలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. అలాగే స్ట్రీట్ వెండర్స్‌కు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. సుమారు 50 లక్షల మంది వీధి వ్యాపారులకు సత్వరమే రూ. 10 వేల వరకు లోన్స్ ఇవ్వనున్నట్లు కేంద్రమంత్రి ప్రకటించారు. అటు రైతులను ఆదుకునేందుకు కిసాన్ క్రెడిట్ కార్డుల పధకాన్ని అమలులోకి తెస్తామన్న కేంద్రమంత్రి.. ఇప్పటికే 14 పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించామన్నారు.