AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్రాక్ట‌ర్‌ను ఢీకొట్టిన కారు.. ఎమ్మెల్యేకు తప్పినముప్పు

ప‌ంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుశీల్ రింకూకు తృటిలో పెను ప్ర‌మాదం త‌ప్పింది. రింకూ ప్ర‌యాణిస్తున్న కారు ట్రాక్ట‌ర్‌ను ఢీకొట్ట‌డంతో ఎమ్మెల్యేకు స్వ‌ల్ప గాయాల‌య్యాయి.

ట్రాక్ట‌ర్‌ను ఢీకొట్టిన కారు.. ఎమ్మెల్యేకు తప్పినముప్పు
Balaraju Goud
| Edited By: |

Updated on: Oct 27, 2020 | 7:50 PM

Share

ప‌ంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుశీల్ రింకూకు తృటిలో పెను ప్ర‌మాదం త‌ప్పింది. రింకూ ప్ర‌యాణిస్తున్న కారు ట్రాక్ట‌ర్‌ను ఢీకొట్ట‌డంతో ఎమ్మెల్యేకు స్వ‌ల్ప గాయాల‌య్యాయి. ఎమ్మెల్యే గ‌న్‌మెన్‌, డ్రైవ‌ర్ కూడా స్వ‌ల్పంగా గాయ‌ప‌డ్డారు. ఇది గమనించిన స్థానికులు గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రికి తరలించారు. అయితే, అదే కారులో ఉన్న ఎమ్మెల్యే వంట మ‌నిషి మాత్రం ఎలాంటి గాయాలు లేకుండా సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డాడు. ఈ మ‌ధ్యాహ్నం ఎమ్మెల్యే రింకూ జ‌లంధ‌ర్ నుంచి చండీగ‌ఢ్‌కు వెళ్తుండ‌గా జ‌డ్లాకు స‌మీపంలో దౌల‌త్‌పూర్ చౌక్ వ‌ద్ద ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. వ‌డ్ల బ‌స్తాల లోడుతో ట్రాక్ట‌ర్ జ‌డ్లాకు వెళ్తుండ‌గా కారు ఢీకొట్టింద‌ని పోలీసులు తెలిపారు. డ్రైవ‌ర్ వెంట‌నే అప్ర‌మ‌త్త‌మై కారు వేగాన్ని అద‌పు చేయ‌డంతో పెను ప్ర‌మాదం తప్పింద‌న్నారు. కాగా, ఎమ్మెల్యే రింకూ జలంధ‌ర్ (వెస్ట్) నియోజ‌క‌వ‌ర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు.

Follow Us