AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మళ్లీ వస్తోన్న పబ్‌జీ, పేరెంట్స్ గుండెల్లో గుబులు !

పబ్‌జీ గేమింగ్‌ యాప్‌పై‌ ఇండియాలో నిషేధం విధించడంతో భారతదేశంలో చాలామంది తల్లిదండ్రలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదకర గేమ్ బారి నుంచి తమ పిల్లలు బయటపడ్డారని ‌సంతోషించారు.

మళ్లీ వస్తోన్న పబ్‌జీ, పేరెంట్స్ గుండెల్లో గుబులు !
Ram Naramaneni
|

Updated on: Oct 23, 2020 | 4:12 PM

Share

పబ్‌జీ గేమింగ్‌ యాప్‌పై‌ ఇండియాలో నిషేధం విధించడంతో భారతదేశంలో చాలామంది తల్లిదండ్రలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదకర గేమ్ బారి నుంచి తమ పిల్లలు బయటపడ్డారని ‌సంతోషించారు. అయితే వారందరికీ షాక్ ఇచ్చేలా పబ్‌జీ గేమింగ్‌ యాప్  తిరిగి భారత్‌లోకి అడుగుపెట్టే చాన్స్ కనిపిస్తోంది. అందుతోన్న సమాచారం మేరు.. పబ్‌జీ కార్పొరేషన్‌ ఓనర్, దక్షిణ కొరియాకు చెందిన క్రాఫన్‌ సంస్థ భారత్‌లో నియామకాలు చేపట్టడం కోసం లింక్డ్‌ఇన్‌లో ఈనెల 20న కొన్ని జాబ్స్ పోస్ట్‌ చేసింది. ‘కార్పొరేట్‌ డెవలప్‌మెంట్‌ డివిజన్‌ మేనేజర్‌’ బాధ్యతలు చేపట్టేవారి కోసం అందులో పోస్ట్‌ పెట్టడం చూస్తుంటే.. ఆ మొబైల్‌ గేమింగ్‌ యాప్‌ తిరిగి ఇండియాలో యాక్టీవ్ అవ్వబోతుందన్న వార్తలకు బలం చేకూరుతుంది. టెన్సెంట్‌ పేరిట కాకుండా.. క్రాఫన్‌ పేరుతో ఆ పోస్ట్‌ పెట్టింది. అంతే కాకుండా.. ‘చురుగ్గా పోస్టింగ్స్ చేపడుతున్నట్లు’ అందులో పేర్కొంది. కాగా, పబ్‌జీ గేమ్‌ మొబైల్‌ వెర్షన్‌పై ఇండియాలో బ్యాన్ ఉండగా.. కన్సోళ్లు, పీసీలపై ఇప్పటికీ కొందరు వినియోగిస్తున్నారు.

చైనా కంపెనీ టెన్సెంట్‌ గేమ్స్‌ 1.5 పర్సెంట్ షేర్‌ను బ్లూహోల్‌ స్టూడియో కొనుగోలు చేసిన నేపథ్యంలో పబ్‌జీ మొబైల్‌పై ఇండియా ఆ నిర్ణయం తీసుకుంది. దానితో పాటు 117 చైనా యాప్‌లపై బ్యాన్ విధించిన విషయం తెలిసిందే. అయితే టెన్సెంట్‌ గేమ్స్‌ నుంచి పబ్‌జీ కార్ప్‌ పబ్లిషింగ్‌ రైట్స్ వెనక్కి తీసుకుంది. మరో వైపు, బ్యాన్ కేవలం కొత్త డౌన్‌లోడ్లకు, బాటిల్‌ రాయల్‌ ఆటను ఆడకుండా ఉండేందుకు మాత్రమే వర్తిస్తుంది. ప్లే స్టోర్‌ లేదా యాపిల్‌ యాప్‌ స్టోర్‌ నుంచి ఆ యాప్‌ను తీసివేయడానికి ముందే ఇన్‌స్టాల్‌ చేసుకునేవారు మాత్రం పబ్‌జీ గేమ్‌ ఆడుకోవచ్చు.

Also Read :

(కృష్ణా జిల్లాలో విషాదం, కరెంట్ షాక్‌తో ఇద్దరు కూలీలు మృతి )

(హెడ్‌మాస్టార్ దారితప్పాడు..సర్టిఫికేట్ కోసం లంచం )

Follow Us