రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి‌ కోవింద్, ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం కుటుంబ సమేతంగా తిరుమలకు రానున్నారు.  చెన్నై నుంచి వైమానిక దళ ప్రత్యేక విమానంలో ఉదయం పదిన్నర గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు.

రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి‌ కోవింద్, ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 23, 2020 | 1:08 PM

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం కుటుంబ సమేతంగా తిరుమలకు రానున్నారు.  చెన్నై నుంచి వైమానిక దళ ప్రత్యేక విమానంలో ఉదయం పదిన్నర గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడాయనకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్‌ స్వాగతం పలుకుతారు.   ప్రెసిడెంట్ ముందుగా తిరుచానూరు పద్మావతీ అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం కుటుంబసమేతంగా శ్రీ వెంకటేశ్వరస్వామిని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దర్శించుకోనున్నారు. స్వామివారి దర్శనానంతరం మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల నుంచి బయలుదేరి రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. మధ్యాహ్నం 3.50 గంటలకు అక్కడి నుంచి అహ్మదాబాద్ వెళ్తారు. మరోవైపు రాష్ట్రపతి తిరుమలకు రానున్న నేపథ్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాటు చేస్తున్నట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్‌ భరత్‌గుప్తా తెలిపారు.

Also Read :

తీవ్ర విషాదం, కరోనాతో మహాత్మా గాంధీ మునిమనవడు సతీశ్​ ధుపేలియా మృతి

గ్రేటర్ ఎన్నికల వేళ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఇంట తీవ్ర విషాదం, మేనల్లుడు ఆత్మహత్య

ఆ ప్రభుత్వ ఉద్యోగుల నివాసాలు అక్కడే ఉండాలి, జగన్ సర్కార్ కీలక ఆదేశాలు

గ్రేటర్‌ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు భారీ షాక్, బీజేపీలోకి విజయశాంతి, రేపే ముహూర్తం