తీవ్ర విషాదం, కరోనాతో మహాత్మా గాంధీ మునిమనవడు సతీశ్​ ధుపేలియా మృతి

కరోనా వ్యాప్తి తగ్గినప్పటికీ వైరస్‌ను లైట్ తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ వ్యాధికి ఇప్పటివరకు సమర్థవంతమైన మెడిసిన్ కానీ, వ్యాక్సిన్ కానీ రాలేదు.

  • Ram Naramaneni
  • Publish Date - 8:05 am, Mon, 23 November 20

కరోనా వ్యాప్తి తగ్గినప్పటికీ వైరస్‌ను లైట్ తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ వ్యాధికి ఇప్పటివరకు సమర్థవంతమైన మెడిసిన్ కానీ, వ్యాక్సిన్ కానీ రాలేదు. ఇప్పటికే ఎంతో ప్రజలతో పాటు ప్రముఖులను ఈ మహమ్మారి వైరస్ బలి తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా  మహాత్మా గాంధీ మునిమనవడు సతీశ్​ ధుపేలియా (66) కోవిడ్ కారణంగా తుదిశ్వాస విడిచారు.  దక్షిణాఫ్రికాలోని జొహాన్నెస్​బర్గ్​లో నివసించే సతీశ్​ కొంతకాలంగా న్యూమోనియాతో సతమతమవుతున్నారు. నెల రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న ఆయనకు ఇటీవల కరోనా సోకింది.

మూడు రోజుల క్రితమే పుట్టినరోజు జరపుకొన్న సతీశ్ ఆదివారం రాత్రి హఠాత్తుగా గుండె పోటు రావడం వల్ల చనిపోయినట్లు.. ఆయన సోదరి ఉమా ధుపేలియా మెస్త్రీ వెల్లడించారు. సతీశ్ దక్షిణాఫ్రికాలో గాంధీ డెవలప్​మెంట్ ట్రస్ట్ కార్యకలాపాలు నిర్వహించడంతో పాటు సామాజిక కార్యకలాపాల్లోనూ చురుగ్గా పాల్గొనేవారు. సతీశ్ ధుపేలియా తన జీవితంలో ఎక్కువ భాగం మీడియా రంగంలోనే గడిపారు. వీడియో, ఫోటో గ్రాఫర్​గా పని చేశారు.

Also Read : మూడురోజుల పాటు తెలంగాణకు వర్షసూచన, అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే ఛాన్స్