గ్రేటర్ ఎన్నికల వేళ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఇంట తీవ్ర విషాదం, మేనల్లుడు ఆత్మహత్య

జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ బీజేపీ గోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజా సింగ్ ఇంట తీవ్ర విషాదం నెలకుంది. ఆయన మేనల్లుడు రోహిత్ సింగ్ (19) సూసైడ్…

  • Ram Naramaneni
  • Publish Date - 8:25 am, Mon, 23 November 20

జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ బీజేపీ గోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజా సింగ్ ఇంట తీవ్ర విషాదం నెలకుంది. ఆయన మేనల్లుడు రోహిత్ సింగ్ (19) సూసైడ్ చేసుకుని తనువు చాలించాడు.  రాజాసింగ్ బావమరిది మనీష్ సింగ్ కుమారుడు అయిన రోహిత్ సింగ్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడన్న వివరాలు తెలియరాలేదు. మంగల్హాట్ రాజా సింగ్ నివాసం నుండి శీతలమాత శ్మశానం వరకు అంతిమయాత్ర సాగింది. ఈ కారణం వల్లనే.. బండి సంజయ్ ని తొలగించమని ఆయన ట్వీట్ చేసినట్లు వైరల్ అయిన ప్రచారంపై బయటికి వచ్చి మాట్లాడలేదు.  కానీ మీడియాకు పంపిన నోట్ లో… బండి సంజయ్ తనను మోసం చేసిన మాట వాస్తవమేనని సంచలన కామెంట్స్ చేసారు రాజా సింగ్.

తన వర్గానికి చెందిన కార్యకర్తలకు టికెట్ ఇవ్వమని అడిగినా బండి సంజయ్ పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఇక్కడ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న రాజాసింగ్.. తనను గెలిపించిన కార్యకర్తలకు కూడా టికెట్ ఇప్పించుకోలేకపోయాను అని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read :

తీవ్ర విషాదం, కరోనాతో మహాత్మా గాంధీ మునిమనవడు సతీశ్​ ధుపేలియా మృతి

మూడురోజుల పాటు తెలంగాణకు వర్షసూచన, అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే ఛాన్స్