మూడురోజుల పాటు తెలంగాణకు వర్షసూచన, అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే ఛాన్స్

తెలంగాణలో రేపటి నుంచి మూడురోజుల పాటు వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇటు బంగాళాఖాతంలో, అటు అరేబియా సముద్రంలో…

  • Ram Naramaneni
  • Publish Date - 7:41 am, Mon, 23 November 20

తెలంగాణలో రేపటి నుంచి మూడురోజుల పాటు వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇటు బంగాళాఖాతంలో, అటు అరేబియా సముద్రంలో వాయుగుండాలు ఏర్పడ్డాయని వివరించారు. ఇవి తీవ్రమై చెరో వైపుకు పయనిస్తున్నాయని వెల్లడించారు. అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారింది. ఇది సోమాలియా తీరం వైపు వెళుతోంది. బంగాళాఖాతంలో ఆగ్నేయ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా ప్రయాణించి తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వద్ద కరైకల్‌ -మహాబలిపురం మధ్య ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం లేదా సాయంత్రానికి తీరాన్ని దాటే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు. దీని ప్రభావంతో తెలంగాణలో మంగళవారం స్వల్పంగా, బుధ, గురువారాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్నారు. తేమ గాలులు వస్తున్నందున ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా 3 నుంచి 6 డిగ్రీల వరకూ అదనంగా పెరిగాయి.

ఇక తుఫాను ప్రభావంతో ఉత్తర కోస్తాలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులలో కురిసే అవకాశాలున్నాయని.. నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

Also Read :  Bigg Boss 4: లాస్య ఎలిమినేటెడ్‌.. హౌజ్‌లో ఒక్కొక్కరి గురించి ఏం చెప్పిందంటే