గ్రేటర్‌ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు భారీ షాక్, బీజేపీలోకి విజయశాంతి, రేపే ముహూర్తం

గ్రేటర్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగలింది. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటోన్న సీనియర్ లీడర్ విజయ శాంతి బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు.

  • Ram Naramaneni
  • Publish Date - 11:08 am, Mon, 23 November 20
గ్రేటర్‌ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు భారీ షాక్, బీజేపీలోకి విజయశాంతి, రేపే ముహూర్తం

గ్రేటర్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగలింది. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటోన్న సీనియర్ లీడర్ విజయశాంతి బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. మంగళవారం ఢిల్లీ వెళ్లి పార్టీ జాతీయ అధ్యక్షడు జేపీ నడ్డా సమక్షంలో ఆమె కమలదళంలో అడుగుపెట్టబోతున్నారు. ఆపై పలువురు కేంద్ర పెద్దల్ని కలిసి..కీలక విషయాలపై చర్చించనున్నారు. కాగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు విజయశాంతి. ఇక దుబ్బాక ఎన్నికల్లో విజయంతో మంచి జోష్‌లో ఉన్న బీజేపీ..జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో  విజయశాంతి సేవలను వినియోగించుకోనున్నట్లు తెలుస్తోంది. పార్టీ అభ్యర్థుల తరుఫున ఆమె ప్రచారం నిర్వహించనున్నారట. బీజేపీ ద్వారానే రాజకీయాల్లో అడుగుపెట్టిన విజయశాంతి… సుమారు రెండు దశాబ్ధాల అనంతరం  సొంత గూటికి చేరుకుంటున్నారు.

 

Also Read :

తీవ్ర విషాదం, కరోనాతో మహాత్మా గాంధీ మునిమనవడు సతీశ్​ ధుపేలియా మృతి

గ్రేటర్ ఎన్నికల వేళ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఇంట తీవ్ర విషాదం, మేనల్లుడు ఆత్మహత్య

ఆ ప్రభుత్వ ఉద్యోగుల నివాసాలు అక్కడే ఉండాలి, జగన్ సర్కార్ కీలక ఆదేశాలు