ఒక్క ఒరిజినల్ నోటుకు.. మూడు ఫేక్ కరెన్సీ నోట్లు ఎక్కడో తెలుసా..
ఒకటికి మూడు. ఒకటికి మూడు. ఇదేమీ గ్యాంబ్లింగ్ గేమ్ కాదు. గుండాట బెట్టింగ్ అంతకన్నా కాదు. అక్షరాలా నకిలీ కరెన్సీ నోట్ల దందా. అతి పెద్ద క్రైమ్. ఒక్క ఒరిజినల్ నోటుకు మూడు ఫేక్ కరెన్సీ నోట్లు....
Fake Currency : ఒకటికి మూడు. ఒకటికి మూడు. ఇదేమీ గ్యాంబ్లింగ్ గేమ్ కాదు. గుండాట బెట్టింగ్ అంతకన్నా కాదు. అక్షరాలా నకిలీ కరెన్సీ నోట్ల దందా. అతి పెద్ద క్రైమ్. ఒక్క ఒరిజినల్ నోటుకు మూడు ఫేక్ కరెన్సీ నోట్లు. ఇదీ దందా. పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారుతుండగా.. క్లైమాక్స్‌లో మరో అదిరిపోయే ట్విస్ట్. ఈ కేసులో నేరగాళ్లు, బాధితులూ ఇద్దరూ నిందితులే. ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ కరెన్సీ క్రైమ్‌ను పోలీసులు బుల్లెట్ స్పీడ్‌తో ఛేదించారు. ఫిర్యాదు అందిన ఆరుగంటల్లోనే నకిలీ నోట్ల కేటుగాళ్ల తాట తీశారు.
లక్షకు మూడు లక్షలు ఆఫర్. లక్ష ఒర్జినల్ కరెన్సీ ఇస్తే.. మూడు లక్షల నకిలీ నోట్లు ఇస్తామని ఆశ చూపించారు. డీల్ బాగుందని కర్నూలు జిల్లాకు చెందిన రమేశ్ కేటుగాళ్ల ట్రాప్‌లో చిక్కుకున్నాడు. గుంటూరు జిల్లా స్టువర్ట్‌పురానికి చెందిన నలుగురు సభ్యుల ముఠా.. ప్రకాశం జిల్లా కుంట జంక్షన్‌లో డబ్బు అందజేస్తామని రమేశ్‌ను రప్పించింది. ఫేక్ కరెన్సీ ఇస్తున్నట్టు డ్రామా చేసి రమేశ్‌ను కత్తితో బెదిరించారు. అతని వద్ద ఉన్న 50వేల ఒరిజినల్ క్యాష్‌తో అక్కడి నుంచి ఉడాయించారు. లబోదిబోమంటూ బాధితుడు డయల్ హండ్రెడ్‌కు కాల్ చేయడంతో పోలీసులు వెంటనే రెస్పాండ్ అయ్యారు. సీసీకెమెరా ఫూటేజ్ పరిశీలించి.. చెక్‌పోస్టుల్లో నిఘాపెట్టి.. ఆరుగంటల్లోనే నకిలీ కరెన్సీ ముఠాను అదుపులోకి తీసుకున్నారు ప్రకాశం పోలీసులు.