AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ క‌న్నుమూత

కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ క‌న్నుమూశారు. అనారోగ్యంతో ఇటీవల ఆస్పత్రిలో చేరిన ఆయన కొద్దిసేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు. పాశ్వన్‌ మృతిని ఆయన కుమారుడు చిరాగ్‌ పాశ్వాన్‌ ధ్రువీకరించారు. తన తండ్రి మరణం గురించి లోక్ జనశక్తి పార్టీ (LGP) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ ట్వీట్ చేస్తూ..

Breaking News : కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ క‌న్నుమూత
Sanjay Kasula
|

Updated on: Oct 08, 2020 | 9:23 PM

Share

Ram Vilas Paswan  : కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ క‌న్నుమూశారు. అనారోగ్యంతో ఇటీవల ఆస్పత్రిలో చేరిన ఆయన కొద్దిసేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు. పాశ్వన్‌ మృతిని ఆయన కుమారుడు చిరాగ్‌ పాశ్వాన్‌ ధ్రువీకరించారు. తన తండ్రి మరణం గురించి లోక్ జనశక్తి పార్టీ (LGP) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ ట్వీట్ చేస్తూ.. “పాపా… ఇప్పుడు మీరు ఈ ప్రపంచంలో లేరు.. కానీ మీరు ఎక్కడ ఉన్నా ఎల్లప్పుడూ నాతోనే ఉంటార‌ని తెలుసు. మిస్ యు పాపా.. అని తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

రాం విలాస్ పాశ్వాన్ ఇటీవల ఢిల్లీ ఆస్ప‌త్రిలో గుండె శస్త్రచికిత్స చేయించుకున్నారు. దేశంలోని అత్యంత ప్రసిద్ధ దళిత నాయకులలో ఒకరైన పాశ్వాన్ గత కొన్ని వారాలుగా ఆసుపత్రిలో ఉన్నారు. గుండె సంబంధ ఇబ్బందుల‌తో ఆయ‌న చాలాకాలంగా బాధ‌ప‌డుతున్న‌ట్లుగా స‌మాచారం.

తండ్రి ఆరోగ్యం గురించి ఇటీవ‌లే చిరాగ్ పాశ్వాన్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా నాన్న ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం సాయంత్రం కొన్ని ఆకస్మిక పరిణామాల కారణంగా అర్ధరాత్రి సమయంలో గుండెకు ఆపరేషన్ చేయవలసి వచ్చింది. అవసరమైతే మ‌రికొన్ని వారాల తర్వాత కూడా మరొక ఆపరేషన్ నిర్వహించాల్సి రావ‌చ్చు. ఈ పోరాటంలో త‌న‌కు, త‌న కుటుంబానికి అండగా నిలిచిన ప్ర‌తీఒక్క‌రికీ ధన్యవాదాలు తెలుపుతున్న‌ట్లు పేర్కొన్నారు.

లోక్‌జన్‌శక్తి పార్టీకి అధ్యక్షుడిగా రాంవిలాస్‌ పాశ్వాన్‌ సుమారు ఐదు దశాబ్దాలుగా భారత రాజకీయ చరిత్రలో కీలక నేతగా ఎదిగారు. ఎనిమిదిసార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న రాంవిలాస్‌ పాశ్వాన్‌…కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీశాఖ మంత్రి బాధ్యతలను నిర్వహిస్తున్నారు.