సోదాలపై సీబీఐ ప్రకటన

ఎంపీ రఘురామకృష్ణంరాజు డైరెక్టర్‌గా ఉన్న ఇండ్‌-భారత్‌ థర్మల్‌ పవర్‌ లిమిటెడ్‌లో సోదాలపై సీబీఐ ప్రకటన విడుదల చేసింది. బ్యాంకులను మోసం చేసిన వ్యవహారంపై కేసు నమోదు చేసినట్లు..

సోదాలపై సీబీఐ ప్రకటన
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 08, 2020 | 10:38 PM

CBI Statement : ఎంపీ రఘురాకృష్ణం రాజు ఆఫీసులే కేంద్రంగా సీబీఐ సోదాలు జరుగుతున్నాయి. తన కంపెనీల్లో ఎలాంటి సోదాలు జరగుతున్న సమాచారం లేదని ఆయన చెప్పినా.. సీబీఐ మాత్రం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇండ్‌-భారత్‌ థర్మల్‌ పవర్‌ లిమిటెడ్‌లో సోదాలపై విపులంగా ఓ ప్రకటన ఇచ్చింది. . బ్యాంకులను మోసం చేసిన వ్యవహారంపై కేసు నమోదు చేసినట్లు తెలిపింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసినట్లు సీబీఐ వెల్లడించింది. సికింద్రాబాద్‌ కేంద్రంగా ఉన్న ఇండ్‌-భారత్‌ కంపెనీపై కేసు పెట్టినట్లు తెలిపింది. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ ఎక్స్‌క్లూజివ్‌గా టీవీ9  సంపాధించింది.

మొత్తం 826 కోట్ల 17 లక్షల రూపాయల మోసానికి పాల్పడినట్లు రఘురామకృష్ణం రాజు సంస్థలపై ఫిర్యాదు అందినట్లు సీబీఐ చెబుతోంది. నిధులు దారి మళ్లించి దుర్వినియోగానికి పాల్పడినట్టు అభియోగం మోపినట్లు వివరించింది. పశ్చిమగోదావరి జిల్లాతోపాటు హైదరాబాద్, ముంబై సహా 11 ప్రాంతాల్లో సోదాలు చేసినట్లు తెలిపింది. కంపెనీ ఆఫీసులు, యజమాని నివాసాలు, ఇతర ప్రదేశాల్లో సోదాలు చేసినట్లు వెల్లడించింది. రఘురామకృష్ణం రాజు సహా మొత్తం 10మందిని నిందితులుగా FIRలో చేర్చింది సీబీఐ. వాళ్లపై ఐపీసీ 120B, 420తో పాటు 13బై2, రెడ్‌విత్‌ 13బై1D కింద కేసు నమోదు చేశారు.